17 Railway stationsలో సీసీ కెమెరాలు

ABN , First Publish Date - 2022-03-12T16:33:54+05:30 IST

స్థానిక వింకోనగర్‌, ఎన్నూర్‌ సహా 17 రైల్వేస్టేషన్లలో రూ.6.28 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు దక్షిణ రైల్వే చెన్నై డివిజన్‌ అధికారులు తెలిపారు. ‘నిర్భయ’ పథకంలో చెన్నై రైల్వే డివిజన్‌

17 Railway stationsలో సీసీ కెమెరాలు

ఐసిఎఫ్‌(చెన్నై): స్థానిక వింకోనగర్‌, ఎన్నూర్‌ సహా 17 రైల్వేస్టేషన్లలో రూ.6.28 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నట్లు దక్షిణ రైల్వే చెన్నై డివిజన్‌ అధికారులు తెలిపారు. ‘నిర్భయ’ పథకంలో చెన్నై రైల్వే డివిజన్‌ లోని 136 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నారు. తొలివిడతగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇటీవల చెన్నై-గుమ్మిడిపూండి మార్గంలోని సబర్బన్‌ రైల్వేస్టేషన్లను అధికారులు పరిశీలించారు. ఈ స్టేషన్లలో చైన్‌ స్నాచింగ్‌, మొబైల్‌ ఫోన్ల చోరీ జరుగుతుండడాన్ని గుర్తించి, కొరుక్కుపేట, తండయార్‌పేట, వీఓసీ నగర్‌, తిరువొత్తి యూర్‌ వింకోనగర్‌, కత్తివాక్కం, ఎన్నూర్‌ సహా 17 స్టేషన్లలో కెమెరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. 


Updated Date - 2022-03-12T16:33:54+05:30 IST