17 స్థానాలకు Congress ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

ABN , First Publish Date - 2021-11-23T17:22:47+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ 17 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాసిక్‌ సోమవారం రాత్రి జాబితాను విడుదల చేశారు. కలబుర్గి - శివానంద పాటిల్‌ మర్తూరు, బెళగావి -

17 స్థానాలకు Congress ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీ 17 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాసిక్‌ సోమవారం రాత్రి జాబితాను విడుదల చేశారు. కలబుర్గి - శివానంద పాటిల్‌ మర్తూరు, బెళగావి - చెన్నరాజ బసవరాజ హట్టిహొళి, ఉత్తరకన్నడ - భీమణ్ణ నాయక్‌, హుబ్బళ్ళి, ధార్వాడ - సలీం అహ్మద్‌, రాయచూరు - శరణగౌడ అన్నదానగౌడ పాటిల్‌, చిత్రదుర్గ - బీ సోమశేఖర్‌, శివమొగ్గ - ప్రసన్నకుమార్‌, దక్షిణకన్నడ - మంజునాథ భండారి, చిక్కమగళూరు - గాయత్రి శాంతేగౌడ, హాసన్‌ - ఎం శంకర్‌, తుమకూరు - ఆర్‌ రాజేంద్ర, మండ్య - ఎంజీ గూళిగౌడ, బెంగళూరు గ్రామీణ - ఎస్‌ రవి, కొడగు - డాక్టర్‌ మంతర్‌గౌడ, బిజాపూర్‌, బాగల్కోట - సునీల్‌గౌడ పాటిల్‌, మైసూరు, చామరాజనగర్‌ - డాక్టర్‌ డీ తిమ్మయ్య, బళ్ళారి - కేసీ కొండయ్య పేర్లను ఖరారు చేశారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ తరపున 20 స్థానాలలో మాత్రమే పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఇప్పటికే ప్రకటించారు. కాగా 17 మంది అభ్యర్థుల జాబితా మాత్రమే ఖరారైంది. మరో ముగ్గురి పేర్లు ఏక్షణంలోనైనా విడుదల కావచ్చుననిపిస్తోంది. చివరిరోజు మంగళవారం నామినేషన్‌ల హోరు కొనసాగనుంది. బీజేపీ 20 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా కాంగ్రెస్‌ కేవలం 17స్థానాలకే తొలి జాబితా ప్రకటించింది. మిగిలిన స్థానాలను ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదనేది సర్వత్రా కుతూహలం రేపువుతోంది. 


జేడీఎస్‌ పోటీ చేయని చోట బీజేపీకి మద్దతు: యడియూరప్ప

పరిషత్‌ ఎన్నికల్లో జేడీఎస్‌ పోటీ చేయని ప్రాంతాల్లో బీజేపీకి మద్దతు ఇస్తారని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు. చిక్కోడిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌ అభ్యర్థులు పోటీ చేయని జిల్లాల్లో వారి మద్దతు బీజేపీకి లభించనుందన్నారు. ఈ విషయమై కుమారస్వామి, దేవేగౌడతో చర్చిస్తానన్నారు. అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు ముందే జనస్వరాజ్‌ పేరిట 30 జిల్లాల్లోనూ సమావేశాల ద్వారా పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేశామన్నారు. 

Updated Date - 2021-11-23T17:22:47+05:30 IST