Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సర్వదర్శనానికి 17 గంటలు

twitter-iconwatsapp-iconfb-icon
సర్వదర్శనానికి  17 గంటలుతిరుమలలోని ఆస్థానమండపం వద్ద సర్వదర్శన క్యూలైన్‌

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, మే 26 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయి క్యూలైన్‌ రాంభగీచా వరకు దాదాపు రెండు కిలోమీటర్లు మేర వ్యాపించింది. సర్వదర్శనానికి దాదాపు 17 గంటల సమయం పడుతోంది. మరోవైపు పెరిగిన భక్తుల రద్దీతో శ్రీవారి ఆలయం మొదలుకొని మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, కాటేజీలు, బస్టాండ్‌, అన్నప్రసాద భవనం వంటి ప్రాంతాలు కిక్కిరిపోయాయి. గదులకు డిమాండ్‌ కొనసాగుతోంది. సీఆర్వో, ఎంబీసీ, గదుల రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.గదిని పొందేందుకు దాదాపు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు కల్యాణకట్టలు కూడా యాత్రికులతో కిక్కిరిసిపోయాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.