ఢాకా నుంచి బ‌య‌ల్దేరిన 167 మంది భార‌త ప్ర‌వాసులు

ABN , First Publish Date - 2020-08-13T20:28:39+05:30 IST

'వందే భార‌త్ మిష‌న్' ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల త‌ర‌లింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

ఢాకా నుంచి బ‌య‌ల్దేరిన 167 మంది భార‌త ప్ర‌వాసులు

ఢాకా: 'వందే భార‌త్ మిష‌న్' ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల త‌ర‌లింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ మిష‌న్ ఐదో ద‌శ‌లో భాగంగా ఢాకా నుంచి 167 మంది భార‌తీయులు ఢిల్లీ ప‌య‌న‌మ‌య్యారు. ఢాకాలోని హ‌జ్ర‌త్ షాహా‌జ‌లాల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి ఎయిర్ ఇండియా విమానం గురువారం 167 మంది ప్ర‌యాణికుల‌తో ఢిల్లీకి బ‌య‌ల్దేరింది. కాగా, ఇది ఢాకా నుంచి ఢిల్లీకి వ‌స్తున్న ఏడో రిపాట్రియేష‌న్ విమానం.


ఇక కరోనావైరస్ మహమ్మారి కారణంగా బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న ప్ర‌వాసుల కోసం 'వందే భారత్ మిషన్' కింద మొదటి విమానం మే 8న ఢాకా నుంచి శ్రీనగర్‌కు వ‌చ్చింది. ఢాకా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు భారతదేశంలోని వివిధ గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా విమానాల ద్వారా 2800 మందిని తరలించిన‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గురువారం నాటికి ఢాకా నుంచి ఢిల్లీకి 7, శ్రీనగర్‌కు 4, కోల్‌క‌తాకు 3... చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌కు చెరో విమానం వ‌చ్చాయి.    


Updated Date - 2020-08-13T20:28:39+05:30 IST