164 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం.. ఈ ఫ్యామిలీ నెల ఖర్చు ఓ సగటు ఉద్యోగి సంవత్సర సంపాదన!

ABN , First Publish Date - 2022-05-16T00:09:24+05:30 IST

‘మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారు’ అని ప్రశ్నించగానే సాధారంగానే ‘నేను, అమ్మా, నాన్న, సోదరి, బామ్మ, తాత ఇలా అంతా కలిసి ఓ ఆరుగురం ఉంటాం’ అని చాలా మంది ఠక్కున సమాధానం చెబుతారు.

164 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం.. ఈ ఫ్యామిలీ నెల ఖర్చు ఓ సగటు ఉద్యోగి సంవత్సర సంపాదన!

ఇంటర్నెట్ డెస్క్: ‘మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారు’ అని ప్రశ్నించగానే సాధారణంగా ‘నేను, అమ్మా, నాన్న, సోదరి, బామ్మ, తాత ఇలా అంతా కలిసి ఓ ఆరుగురం ఉంటాం’ అని చాలా మంది ఠక్కున సమాధానం చెబుతారు. ఇక మరికొందరు మాత్రం నాలుగు దగ్గరే ఆగిపోతారు. ఇపుడు ఇదంతా ఎందుకు? అని అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి. 


ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న రోజులివి. ఆధునుకీకరణ, ఆర్థిక, ఉద్యోగ తదితర కారణాల వల్ల చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో కూడా  ఓ కుటుంబం ఉమ్మడిగానే జీవిస్తోంది. ఇంతకూ ఆ కుటుంబంలో ఎంత మంది ఉంటారన్న విషయం చెప్పలేదు కదూ. రాజస్థాన్‌లోని నాగౌర్‌ ప్రాంతంలోని ఆరుగురు అన్నదమ్ములు.. మనవళ్లు, మనవరాళ్లు పుట్టినా ఇప్పటికీ కలిసే ఉంటున్నారు. అన్నదమ్ముల భార్యలు.. వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఇలా మొత్తం 164 మంది కుటుంబ ఒకే ఇంట్లో(50 గదులు) నివసిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. వీరి నెల వారి నిత్యావసర సరుకుల ఖర్చు.. ఓ సగటు ఉద్యోగి సంవత్సరాదాయానికి సమానం. సరిగ్గా చెప్పాలంటే ఈ కుటుంబం నిత్యావసర సరుకుల కోసం నెలకు రూ.3లక్షలు ఖర్చు చేస్తుంది. ఇంత మందికీ కలిపి ఇంట్లో ఒకే వంట గది ఉండగా.. రోజుకు 30కేజీల కూరగాయలు, సుమారు 60 కేజీల పిండిని వంట కోసం ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యులందరికీ వంట చేయడం ఒక్కరి వల్ల కాదు కబట్టి.. సుమారు 17 మంది మహిళలు వంటింట్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. 



కాగా.. ఈ కుటుంబానికి చెందిన సభ్యుడు కైలాశ్ ప్రజాపత్ మాట్లాడుతూ.. తమ ఇంట్లో నెలకు 8 గ్యాస్ సిలిండర్లు ఖర్చవుతాయని పేర్కొన్నారు. గేదలు, ఆవులు, మేకలు కలిసి సుమారు 85 పశువులు ఉన్నట్టు చెప్పారు. వాటి నుంచి లభించిన పాలు తమ కుటుంబానికి సరిపోతాయని వెల్లడించారు. అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులు చేస్తున్నట్లు తెలిపారు. తమకు కొంత వ్యవసాయ భూమి ఉందనీ.. మరికొంత భూమిని లీజుకు తీసుకుని అందులో వ్యవసాయం చేస్తున్నట్లు వివరించారు. 




Updated Date - 2022-05-16T00:09:24+05:30 IST