ఒమైక్రాన్‌పై రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకటన

ABN , First Publish Date - 2021-12-20T23:18:37+05:30 IST

దేశంలో ఇంతవరకూ కరోనా వైరస్ వేరియంట్ ఒమైక్రాన్ కేసులు 161 నమోదైనట్టు..

ఒమైక్రాన్‌పై రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో ఇంతవరకూ కరోనా వైరస్ వేరియంట్ ఒమైక్రాన్ కేసులు 161 నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్‌ మాండవీయ తెలిపారు. కోవిడ్ పరిస్థితిపై సోమవారంనాడు రాజ్యసభలో జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఒమైక్రాన్ వైరస్ విస్తరించకుండా పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కోవిడ్ మొదటి, రెండవ వేవ్‌లలో ఎదురైన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని కోవిడ్ వేరియంట్‌ విస్తరించినట్లయితే ఇంపోర్టెట్ మెడిసెన్లను పెద్దఎత్తున అందుబాటులో ఉంచుతామని చెప్పారు.


''ఇవాళ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్లు తగినంత అందుబాటులో ఉంచాం. 17 కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద ఉన్నాయి. మా ఉత్పత్తి సామర్థ్యం కూడా పెంచాం. నెలకు 31 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ల ఉత్పత్తి సామర్థ్యం ఇండియాకు ఉంది. రాబోయే రెండు నెలల్లో ఈ సామర్థ్యాన్ని నెలకు 45 కోట్లకు పెంచుతాం'' అని మంత్రి రాజ్యసభకు వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో హెల్త్ కేర్ వర్లర్లు ఇంతవరకూ 88 శాతం మందికి తొలి డోసు వ్యాక్సిన్లు, 55 శాతం మందికి రెండో డోసు వ్యాక్సిన్లు ఇచ్చారు. దేశంలోని మెజారిటీ జనాభా వ్యాక్సిన్ తీసుకున్నారు'' అని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-12-20T23:18:37+05:30 IST