Abn logo
Apr 9 2021 @ 02:40AM

15 రోజుల్లో 1600 కేసులు

నిజామాబాద్‌ ఆస్పత్రిలో బెడ్లను సిద్ధం చేసిన దృశ్యం 

నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో కరోనా ఉధృతి

మహారాష్ట్రతో సరిహద్దు ఉండడమే కారణం


నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ నిజామాబాద్‌ జిల్లాను అతలాకుతలం చేస్తోంది. గడచిన15 రోజుల్లోనే సుమారు 1600 కేసులు నమోదయ్యాయి. కరోనా ఉధృతంగా ఉన్న మహారాష్ట్ర నుంచి జిల్లాలోని సరిహద్దు గ్రామాలకు రాకపోకలపై సరైన నియంత్రణ ఉండడంలేదు. రాకపోకలు మామూలుగానే ఉండడంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సరిహద్దు మండలాలైన వర్ని, కోటగిరి, బోధన్‌, రెంజల్‌ పరిధిలో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. సాటాపూర్‌, నవీపేటలో ప్రతి శనివారం పశువులు, మేకల సంత జరుగుతుంది. ఇక్కడికి మహారాష ్ట్రనుంచి చాలామంది వస్తున్నారు. వీరికి ఎటువంటి టెస్టులు చేయకపోవడం కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతోంది.జనరల్‌ ఆసుపత్రిలో 185 మందికి చికిత్స 

 ఈ 15 రోజుల్లోనే జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో 185మంది పాజిటివ్‌ వచ్చిన వారు చికిత్స కోసం చేరారు. ఈ ఆస్పత్రిలో 270 పడకలు ఉన్నాయి. 220 బెడ్స్‌కు ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచగా.. 50వెంటిలేటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 9ప్రై వేటు ఆస్పత్రులకు కరోనా చికిత్సకోసం అనుమతి ఇచ్చారు. వీటిలో 305బెడ్స్‌ అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 50 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలు కూడా అందిస్తుండడంతో సిబ్బంది కొరత ఉందని, మరికొంతమందిని ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా, నిర్మల్‌ జిల్లాలో గురువారం ఒక్కరోజే 291 కేసులు నమోదయ్యాయి. 

Advertisement
Advertisement
Advertisement