రూ.160 కోట్లతో సముద్ర ముఖద్వార ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2022-08-20T06:05:57+05:30 IST

వాకాడు మండలం పూడిరాయదొరువు సమీపంలో సముద్ర ప్రాంతాన్ని శుక్రవారం కేంద్ర ప్రభుత్వ హైలెవల్‌ కమిటీ ప్రతినిధి డాక్టర్‌ అజిత్‌కుమార్‌ పట్నాయక్‌, మత్స్య శాఖ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు, ఎండోమార్‌ కోస్టల్‌ హైడ్రోలిక్‌ డైరెక్టర్‌ చంద్రమోహన్‌, గూడూరు శాసనసభ్యుడు వరప్రసాదరావు తదితరులు పరిశీలించారు.

రూ.160 కోట్లతో సముద్ర ముఖద్వార ప్రతిపాదనలు
పూడిరాయదొరువు తీరం వద్ద నివేదికలను పరిశీలిస్తున్న కేంద్ర బృందాలతో ఎమ్మెల్యే వరప్రసాద రావు

వాకాడు, ఆగస్టు 19 :వాకాడు మండలం పూడిరాయదొరువు సమీపంలో సముద్ర ప్రాంతాన్ని శుక్రవారం కేంద్ర ప్రభుత్వ హైలెవల్‌ కమిటీ ప్రతినిధి డాక్టర్‌ అజిత్‌కుమార్‌ పట్నాయక్‌, మత్స్య శాఖ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు, ఎండోమార్‌ కోస్టల్‌ హైడ్రోలిక్‌  డైరెక్టర్‌ చంద్రమోహన్‌, గూడూరు శాసనసభ్యుడు వరప్రసాదరావు తదితరులు   పరిశీలించారు.160 కోట్ల రూపాయలతో సముద్ర ముఖద్వారాల ఏర్పాటుకు సంబంధించి ఎండోమర్‌ కోస్టల్‌ హైడ్రాలిక్‌ బృందం రెండు నెలలుగా సర్వేచేసి ప్రాథమిక నివేదికను రాష్ట్రప్రభుత్వానికి ఇటీవల అందజేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున అజిత్‌కుమార్‌ పట్నాయక్‌ బృందం పూడిరాయదొరువుకు చేరుకుని  పులికాట్‌ సరస్సులో పూడిక తీయడం ద్వారా పర్యావరణ సమతుల్యత,  వన్యప్రాణులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు.ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడూరు డివిజన్‌లో కోట, వాకాడు, చిల్లకూరు, సూళ్లూరుపేట డివిజన్‌లో సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం,  మండలాల పరిధిలోని 35వేల మత్య్సకార కుటుంబాలకు పూడిక తీయడం ద్వారా ఉపాధి దొరుకుతుందన్నారు. సముద్రంలో రెండు కిలోమీటర్ల  పొడవు, 400 మీటర్ల వెడల్పు, 10 అడుగులలోతు ఉండేలా గోడలను నిర్మించడంతో విశాలమైన ఓడలను నిలుపుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు.పులికాట్‌కు విదేశాల నుంచి వచ్చే పక్షులకు చేప ప్రధాన ఆహారం కనుక 3 మీటర్ల లోతుండేలా పూడికతీయడంతో పక్షులకు ఆహారం దొరుకుతుందన్నారు.తద్వారా పర్యాటక అభివృద్ది జరుగుతుందన్నారు.అజిత్‌కుమార్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ హార్బర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.జాతీయ తీర ప్రాంత పరిశోధనా సంస్థ(ఎన్‌సీసీఆర్‌) బృందంలో ఉమాశంకర్‌ పాండా,  అల్లూరి సత్యకిరణ్‌రాజు, ఎండోమర్‌ కోస్టల్‌ హైడ్రాలిక్‌ బృందంలో గురుప్రకాష్‌, భాస్కరన్‌, పార్ధిబన్‌, శక్తివేల్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస నాయక్‌, ఏడీ చాంద్‌బాషా, అధికారులు శివకుమార్‌, పవన్‌కుమార్‌, వైసీపీ నాయకులు భక్తవత్సల రెడ్డి, వెంకటరత్నం, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T06:05:57+05:30 IST