హోటల్లో గది కోసం 16ఏళ్ల యువతి హడావిడి.. సిబ్బందికి డౌటొచ్చి పోలీసులకు ఫోన్.. చివరకు ఆమె చెప్పింది విని అధికారులు షాక్

ABN , First Publish Date - 2022-02-11T01:42:12+05:30 IST

ఆ యువతికి ప్రస్తుతం 16ఏళ్లు. తండ్రి ఇచ్చిన డెబిట్ కార్డు ద్వారా పశ్చిమ బెంగాల్ నుంచి ఇండోర్‌కు విమానంలో చేరుకుంది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లింది. బస చేయడానికి తనకు గది

హోటల్లో గది కోసం 16ఏళ్ల యువతి హడావిడి.. సిబ్బందికి డౌటొచ్చి పోలీసులకు ఫోన్.. చివరకు ఆమె చెప్పింది విని అధికారులు షాక్

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువతికి ప్రస్తుతం 16ఏళ్లు. తండ్రి ఇచ్చిన డెబిట్ కార్డు ద్వారా పశ్చిమ బెంగాల్ నుంచి ఇండోర్‌కు విమానంలో చేరుకుంది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లింది. బస చేయడానికి తనకు గది కావాలంటూ సిబ్బందిని కోరింది. ఆమెకు సంబంధించిన వాళ్లు అక్కడ ఎవరూ లేకపోవడంతో.. సిబ్బంది అనుమానించారు. ఈ క్రమంలోనే ఆ యువతిని వివరాలు అడిగారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో సిబ్బందికి అనుమానం మరింత పెరిగింది. దీంతో తొలుత ఆమెకు గది చూపించారు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు ఆ యువతిని విచారించారు. ఆ తర్వాత ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు విని అధికారులు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పశ్చిమ బెంగాల్‌లో నివసిస్తున్న 16ఏళ్ల యువతి ఈ నెల 7న ఇండోర్‌కు చేరుకుంది. అనంతరం రెండు రోజులపాటు స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని బస చేసింది. తాజాగా ఆ హోటల్‌లో గదిని ఖాళీ చేసి, పక్కనే ఉన్న మరో హోటల్‌కు వెళ్లింది. బస చేయడానికి గది కావాలని హోటల్ సిబ్బందిని కోరింది. యువతికి 18ఏళ్లు నిండకపోవడం..పైగా ఒంటరిగా వచ్చి గదిని కోరడంతో సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. వివరాలు కూడా పొంతనలేకుండా చెప్పడంతో వారి అనుమానం మరింత బలపడింది. దీంతో తొలుత ఆ యువతికి గదిని చూపించిన హోటల్ సిబ్బంది.. తర్వాత పోలీసులకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో అధికారులు రంగంలోకి దిగి విషయం ఆరా తీశారు. దీంతో ఆ అమ్మాయి అసలు విషయం చెప్పేసింది.



తన తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే విడిపోయారని చెప్పింది. తన తండ్రి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి మాత్రం ముంబైలో నివసిస్తున్నట్టు వెల్లడించింది. కొన్నేళ్లుగా తాను తన బంధువుల ఇంట్లోనే నివసిస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులు ఎవరి స్వేచ్ఛ వాళ్లు కోరుకున్నప్పుడు తాను కూడా అలాగే బతకాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. ఒంటరిగా జీవించేందుకు ఇండోర్‌కు చేరుకుని హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నట్టు వివరించింది. కాగా.. యువతి నోటి వెంట ఈ మాటలు విని అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం పశ్చిమ బెంగాల్‌లో నివసిస్తున్న ఆ యువతి బంధువులకు సమాచారం అందించారు. తర్వాత ఆమెను తన బంధువులకు అప్పగించారు.




Updated Date - 2022-02-11T01:42:12+05:30 IST