16 ఏళ్ల చిన్నది.. టిక్‌టాక్‌ రికార్ట్ సృష్టించింది

ABN , First Publish Date - 2020-11-24T03:25:13+05:30 IST

16 ఏళ్ల అమెరికా చిన్నది. ప్రపంచంలోనే తొలిసారిగా 100 మిలియన్(10 కోట్లు) ఫాలోవర్స్‌ను సంపాదించిన టీక్‌టాకర్‌గా...

16 ఏళ్ల చిన్నది.. టిక్‌టాక్‌ రికార్ట్ సృష్టించింది

వాషింగ్టన్: 16 ఏళ్ల అమెరికా చిన్నది. ప్రపంచంలోనే తొలిసారిగా 100 మిలియన్(10 కోట్లు) ఫాలోవర్స్‌ను సంపాదించిన టీక్‌టాకర్‌గా రికార్డు సృష్టించింది. చార్లీ డీ అమీలియో అనే 16 ఏళ్ల అమ్మాయి.. టిక్‌టాక్‌లో తొలిసారిగా 10 కోట్ల మంది ఫాలోవర్స్‌ మార్క్‌ను చేరుకుంది. అంతేకాదు ప్రపంచంలో అత్యంత ఎక్కవ మంది ఫాలో అవుతున్న టిక్‌టాకర్‌గా నిలిచింది. అయితే ఆమె తన టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించింది గతేడాదిలోనే. 2019 మే నుంచి ఆమె టిక్‌టాక్‌ను వినియోగిస్తోంది. ప్రతి రోజూ పోస్టులు పెడుతూ తన ఫ్యాన్స్ అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె 10 కోట్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ హాలీవుడ్ హీరో విల్‌స్మిత్‌కంటే రెండింతలు.. హాలీవుడ్ హీరో, ప్రొఫెషనల్ రెజ్లర్ డ్వేన్ స్మిత్‌ ఫాలోవర్స్ కంటే మూడింతలు ఉన్నారు. సూపర్ కదా..


ఇదిలా ఉంటే టిక్‌టాక్‌ భారత్‌లో బ్యాన్ అయిన సంగతి తెలిసిందే. అమెరికా సహా ఇప్పటికీ అనేక దేశాల్లో సూపర్ ఫాంలో రన్ అవుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సోషల్ మీడియా యాప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది.

Updated Date - 2020-11-24T03:25:13+05:30 IST