ఉత్తరాఖండ్‌లో యాక్టివ్‌గా 16 కొవిడ్ వేరియంట్లు

ABN , First Publish Date - 2021-05-17T21:13:55+05:30 IST

ఉత్తరాఖండ్‌లో 16 కరోనా వైరస్ వేరియంట్లు యాక్టివ్‌గా ఉన్నాయి. వైరస్ జన్యక్రమం గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర

ఉత్తరాఖండ్‌లో యాక్టివ్‌గా 16 కొవిడ్ వేరియంట్లు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో 16 కరోనా వైరస్ వేరియంట్లు యాక్టివ్‌గా ఉన్నాయి. వైరస్ జన్యక్రమం గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన నమూనాల నివేదిక ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది. ఈ నమూనాలు అన్నింటిలోనూ సాధారణ కరోనా వైరస్ వేరియంట్ అయిన సార్స్-కోవ్-2 ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రభుత్వం పంపిన వాటిలో 35 నమూనాల్లో యూకే వేరియంట్‌కు చెందిన మూడు వేర్వేరు మ్యుటేషన్లను గుర్తించగా ఇతర నమూనాల్లో 12 ఇతర మ్యుటేషన్లు ఉన్నాయి. 

 

వైరస్ జన్యక్రమాన్ని తెలుసుకునేందుకు  ఉత్తరాఖండ్ ప్రభుత్వం మొత్తం 851 నమూనాలను ఢిల్లీ పంపింది. వీటిలో 285 శాంపిళ్ల నివేదిక అందింది. మిగతా వాటి నివేదిక రావాల్సి ఉంది.  ప్రభుత్వానికి అందిన నివేదికలో 285లో 208 శాంపిళ్లలో సాధారణ సార్స్-కోవ్-2 ఉన్నట్టు వెల్లడైంది. 32 శాంపిళ్లలో యూకే వేరియంట్ బి117, ఒకదాంట్లో యూకే వేరియంట్ బి16171, రెండింటిలో బి16172 వేరియంట్‌ను గుర్తించారు. అలాగే, 42 శాంపిళ్లలో 12 ఇతర రకాల మ్యుటేషన్లను గుర్తించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  

Updated Date - 2021-05-17T21:13:55+05:30 IST