వివిధ ప్రాంతాలకు 16 బస్సు సర్వీసులు

ABN , First Publish Date - 2020-05-25T11:14:07+05:30 IST

రోజురోజుకూ బస్సు సర్వీసుల సంఖ్య పెరుగుతోంది. గిద్దలూరు డిపో నుంచి వివిధ ప్రాంతాలకు 16 బస్సు సర్వీసులను నడుపుత్నుట్లు డిపో మేనేజర్‌ జె.సుందర్‌రావు తెలిపారు.

వివిధ ప్రాంతాలకు  16 బస్సు సర్వీసులు

గిద్దలూరు, మే 24 : రోజురోజుకూ బస్సు సర్వీసుల సంఖ్య పెరుగుతోంది. గిద్దలూరు డిపో నుంచి వివిధ ప్రాంతాలకు 16 బస్సు సర్వీసులను నడుపుత్నుట్లు డిపో మేనేజర్‌ జె.సుందర్‌రావు తెలిపారు. అంతర్‌ జిల్లా సర్వీసులను ప్రారంభించామని, జిల్లాలోని మార్కాపురానికి 5 బస్సులు, తురిమెళ్ల మీ దుగా కంభానికి 3, కొమరోలుకు ఒకటి చొప్పున నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. కడపజిల్లాలోని పోరుమామిళ్ల వరకు 3 సర్వీసులు ప్రారంభించామని, తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలకు ఒక బ స్సు సర్వీసు ప్రారంభించామని చెప్పారు.


రాజధాని విజయవాడకు తొలుత 2 బస్సు సర్వీసులను ఏర్పా టు చేసి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 3వ సర్వీసును కూడా ప్రారంభించామని తెలిపారు. మిగతా సర్వీసులకు పాయింట్లలోనే టికెట్లు తీసుకోవాలని, విజయవాడకు వెళ్లే అన్ని సర్వీసులకు మాత్రం నేరుగా విజయవాడ వరకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించామని డిపో మేనేజర్‌ తెలిపారు. వివిధ రూట్లలో అనుకున్న విధంగా ప్రయాణికుల రద్దీ  లేదన్నారు. సగం సీట్లతో మాత్రమే బస్సులను తిప్పాల్సి ఉండగా ఆ సగంలో కూడా సగటున 70శాతం సీట్లు కూడా భర్తీకాని పరిస్థితి కనిపిస్తున్నది.

Updated Date - 2020-05-25T11:14:07+05:30 IST