హైదరాబాద్‌కు 16 బిహార్‌ రెజిమెంట్‌!

ABN , First Publish Date - 2020-07-11T07:30:27+05:30 IST

గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడిన బిహార్‌ రెజిమెంట్‌ 16వ బెటాలియన్‌.. పీస్‌లొకేషన్‌కు వెళ్లడంలో భా గం గా హైదరాబాద్‌కు వస్తున్నట్టు తెలిసింది. ఈ బెటాలియన్‌లోని సైనికులు తూర్పు లద్దాఖ్‌లో మార్చి -ఏప్రి

హైదరాబాద్‌కు 16 బిహార్‌ రెజిమెంట్‌!

న్యూఢిల్లీ, జూలై 10: గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడిన బిహార్‌ రెజిమెంట్‌ 16వ బెటాలియన్‌.. పీస్‌లొకేషన్‌కు వెళ్లడంలో భా గం గా హైదరాబాద్‌కు వస్తున్నట్టు తెలిసింది. ఈ బెటాలియన్‌లోని సైనికులు తూర్పు లద్దాఖ్‌లో మార్చి -ఏప్రి ల్‌ కాలంలో తమ రెండున్నరేళ్ల విధులను పూర్తి చేసినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ కాలం ముగిసిన తర్వాత పీస్‌ లొకేషన్‌కు సైనికులు వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా మూలంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో జాప్యం జరిగిందని ఓ అధికారి తెలిపారు. జూన్‌ 15న చైనా బలగాలతో గ ల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 కు సమీపంలో జరిగిన ఘర్షణలో 16 బిహార్‌, ఇతర యూనిట్ల సైనికులు పోరాడారు. ఈ హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న తెలంగాణ బిడ్డ కల్నల్‌ బి సంతోష్‌ బాబు చైనా సైన్యంతో వీరోచితగా పోరాడి వీరమరణం చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడీ బెటాలియన్‌ హైదరాబాద్‌కు వస్తోందని తెలిసింది.  

Updated Date - 2020-07-11T07:30:27+05:30 IST