రోడ్లపై తిరుగుతున్న 16 మంది అరెస్టు

ABN , First Publish Date - 2020-03-31T09:31:29+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలను పట్టించుకోకుండా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న 16 మందిపై నగర పోలీసులు సోమవారం కేసులు నమోదుచేసి అరెస్టు చేశారు. వీరి నుంచి

రోడ్లపై తిరుగుతున్న 16 మంది అరెస్టు

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నిబంధనలను పట్టించుకోకుండా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న 16 మందిపై నగర పోలీసులు సోమవారం కేసులు నమోదుచేసి అరెస్టు చేశారు. వీరి నుంచి పది వాహనాలను సీజ్‌ చేశారు. వీరితోపాటు మోటార్‌ వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న 1712 మందిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదుచేసి రూ.4.06 లక్షలు అపరాధ రుసుము వసూలు చేశారు.


లాక్‌డౌన్‌ అమలు ప్రారంభమైన ఈ నెల 23 నుంచి సోమవారం వరకు రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న 381 క్రిమినల్‌ కేసుల్లో 726 మందిని అరెస్టు చేసి వారి నుంచి 565 వాహనాలను సీజ్‌ చేసినట్టు సీపీ ఆర్కేమీనా తెలిపారు. అలాగే ఎంవీ యాక్ట్‌ నిబంధనలు పాటించని 21,891 మందిపై ఎంవీ యాక్ట్‌ కింద కేసులు నమోదుచేసి రూ.53 లక్షలు అపరాధ రుసుము వసూలు చేశామన్నారు.

Updated Date - 2020-03-31T09:31:29+05:30 IST