‘పరిషత్‌‘లకు నిధుల పండుగ

ABN , First Publish Date - 2020-07-15T11:44:30+05:30 IST

కొన్నేళ్లుగా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా, మండల పరిషత్‌లకు నిధులు వచ్చేశాయి. మండల పరిషత్‌లకు 10శాతం,

‘పరిషత్‌‘లకు నిధుల పండుగ

సుదీర్ఘ కాలం తర్వాత విడుదలైన నిధులు 

15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు

జనాభా ప్రాతిపదికన మండల, జిల్లా పరిషత్‌లకు పంపిణీ

హర్షం వ్యక్తం చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు


ఆదిలాబాద్‌, జూలై14 (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్లుగా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా, మండల పరిషత్‌లకు నిధులు వచ్చేశాయి. మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్‌లకు 5 శాతం నిధులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలు జిల్లా అధికారులకు అందాయి. ఇప్పటికే గత పాలకవర్గానికి 14వ ఆర్థిక సంఘం నిధులు అందకుండానే పదవీ కాలం ముగిసిపోయింది. మళ్లీ గతేడాది క్రితం కొత్త పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టింది. అయితే ఏడాది అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లా విభజన తర్వాత ఆర్థిక సంఘం నిధులు మంజూరుకావడం ఇదే మొదటిసారి. జిల్లాలో ని 18 మండలాలకు గాను అర్బన్‌ మండలం మినహా 17 మండలా లకు నిధులను కేటాయించే అవకాశం ఉంది.


జిల్లాకు సుమారుగా రూ.61లక్షల నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి మూడు నెలలకోసారి విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధుల మంజూరు ప్రారంభం కావడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికే రెండుసార్లు ఉత్తమ జడ్పీగా ఎన్నికైన ఆదిలాబాద్‌ జడ్పీకి కేంద్ర ప్రభుత్వం రూ.50లక్షల చొప్పున కోటి రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో జడ్పీ కార్యాలయ ఆవరణలో వ్యాపా ర సముదాయాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉంది.


అభివృద్ధి పనులకు మార్గం సుగమం..

గత ప్రభుత్వాల హయాంలో ఆర్థిక సంఘం నిధులు క్రమం తప్ప కుండా విడుదలయ్యేవి. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా నిలిపి వేసింది. దీంతో జడ్పీ, మండల పరిషత్‌లకు ఆరేళ్లుగా నిధులు నిలిచిపోయాయి. నిధుల కొరతతో జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపో యారు. పలుమార్లు ప్రభుత్వాలు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలి తం లేకపోవడంతో ఎదురు చూపులు తప్ప లేదు. ఎట్టకేలకు జిల్లా, మండల పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తూ కేం ద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా నిలిచిపోయిన నిధులు విడుదల కావడంతో అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. 


నిధుల పంపిణీకి కసరత్తు..

సుదీర్ఘ కాలం అనంతరం మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. తల రూపాయలు 8 చొప్పున నిధులను కేటాయించనున్నారు. జిల్లాలోని 17 మండలాలతో పాటు జడ్పీకి కలిపి రూ.61లక్షల నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో నిధుల కేటాయింపు పూర్తికానుందని పేర్కొంటున్నారు. అత్యవసర ఖర్చుల నిమిత్తమే ఈ నిధులను వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో కేటాయించిన విధంగా కాకుండా తక్కువైనా ఆర్థిక సంఘం నిధులతో జిల్లా, మండల పరిషత్‌ పాలన గాడిలో పడే అవకాశం కనిపిస్తుంది. 


హామీలు నెరవేరే అవకాశం..

జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందామనే సంతోషమే తప్ప నిధులు లేక పోవడంతో నిరాశనే మిగిలింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొన్ని హామీలైనా నెరవేరే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుంటే సభ్యులు నీళ్లు మింగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొందరైతే నిధులు లేవన్న కారణంగా క్షేత్ర స్థాయి గ్రామ పర్యటనలకు దూరంగానే ఉంటున్నారు. అలాగే సమావేశాల సమయంలోనే తప్ప కార్యాలయాలకు ఎవరూ రాకపోవడంతో కళ తప్పి పోతున్నాయి. నిధులు లేవన్న కారణంగా సభ్యులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు పై అంతగా ఆసక్తి చూపడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల పరిస్థితి ఒకే విధంగా మారింది. అయితే ఇటీవల విడుదలైన నిధులతో కొంత ఊరట కలుగడంతో సభ్యులు కొత్త ఉత్సాహాంతో కనిపిస్తున్నారు.


నిధుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం..: కిషన్‌ (జడ్పీ సీఈవో, ఆదిలాబాద్‌)

15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన ఉత్తర్వులు అందాయి. దీంతో జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయించేందుకు ఏర్పాట్లను చేస్తున్నాం. మరో రెండు మూడు రోజుల్లో జిల్లాలోని 17 మండల పరిషత్‌లకు నిధుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2020-07-15T11:44:30+05:30 IST