తమిళనాడులో తగ్గని కరోనా తీవ్రత.. ఒక్కరోజే 1562 కేసులు

ABN , First Publish Date - 2020-06-09T16:09:25+05:30 IST

తాజా వైద్య పరీక్షలలోనూ చెన్నై వాసులకే అధికంగా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి.

తమిళనాడులో తగ్గని కరోనా తీవ్రత.. ఒక్కరోజే 1562 కేసులు

  • చెన్నైలో 1149మందికి కరోనా 
  • డిశ్చార్జి అయినవారు 528 మంది
  • వైరస్‌తో 17 మంది మృతి

చెన్నై : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతూనే ఉంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1562 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో కరోనా తాకిడికి గురైనవారి సంఖ్య 33,229కు పెరిగింది. తాజా వైద్య పరీక్షలలోనూ చెన్నై వాసులకే అధికంగా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. చెన్నైలో ఒకే రోజు 1149 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది.  రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నమోదైన 1562 పాజిటివ్‌ కేసులలో 1520 కేసులు రాష్ట్రానికి చెందినవి . తక్కిన 42 కేసుల్లో ఖతార్‌, కువైట్‌ (12 కేసులు) మహారాష్ట్ర (22) ఢిల్లీ (6) హర్యానాకు చెందిన వారున్నారు. చెన్నైలో సోమవారం ఒకే రోజు 1149 మందికి కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. 


దీంతో నగరంలో కరోనా కేసుల సంఖ్య 23298 కు చేరింది. సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందిన 528 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటిదాకా డిశ్చార్జి అయినవారి సంఖ్య 17,527కు పెరిగింది. ఇక చికిత్స ఫలించక ప్రైవేటు ఆస్పత్రుల్లో ముగ్గురు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 14 మంది చొప్పున మొత్తం 17 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనా తాకిడికి గురై చికిత్స  ఫలించక మృతి చెందినవారి సంఖ్య 286కు చేరింది.  రాష్ట్రంలోని 44ప్రభుత్వ ఆస్పత్రులు, 30 ప్రైవేటు ల్యాబ్‌లలోనూ సోమవారం 14,982 మందికి  కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటిదాకా 6,07,952 శాంపిల్స్‌ను పరీక్షించారు.



Updated Date - 2020-06-09T16:09:25+05:30 IST