IPL2022 : చెన్నైపై మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ సంచలనం..

ABN , First Publish Date - 2022-05-02T22:17:32+05:30 IST

పుణె : యువ సంచలనం, sunrisers hyderabad పేసర్ Umran malik ఈ ఏడాది IPL 2022లో అదరగొడుతున్నాడు. అమితవేగంతో బంతులు విసురుతూ క్రికెట్ ప్రేమికులతోపాటు మాజీ క్రికెటర్లను సైతం అబ్బురపరుస్తున్నాడు.

IPL2022 : చెన్నైపై మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ సంచలనం..

పుణె : యువ సంచలనం, sunrisers hyderabad పేసర్ Umran malik ఈ ఏడాది IPL 2022లో అదరగొడుతున్నాడు.  వేగవంతమైన బంతులు విసురుతూ క్రికెట్ ప్రేమికులతోపాటు మాజీ క్రికెటర్లను సైతం అబ్బురపరుస్తున్నాడు. గతరాత్రి chennai super kings పై పోరులో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయినా ఈ ఐపీఎల్ 2022 సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన 2 బాల్స్ వేసి ఆకట్టుకున్నాడు. మ్యాచ్ 10వ ఓవర్‌లో గంటకు 154 కిలోమీటర్ల వేగంతో ఓ బంతి వేశాడు. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఫుల్ డెలివరీ వేశాడు. అయితే ఈ బంతిని Ruturaj Gaikwad బౌండరీ తరలించాడు. ఇదే వేగంతో మ్యాచ్ 19వ ఓవర్‌లో కూడా మరో బంతి విసిరాడు. CSK కెప్టెన్ మహింద్రా సింగ్ ధోనీకి యార్కర్ వేశాడు. ఈ బంతికి ధోనీ సింగిల్ తీశాడు. దీంతో ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బంతి వేసిన బౌలర్‌గా ఈ యంగ్ పేసర్ నిలిచాడు. 22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్‌లో వికెట్లు ఏమీ తీయలేకపోయినప్పటికీ ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన డెలివరీలు నమోదుచేయడంపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ట్విట్టర్ వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఈ సీజన్‌లో లూకీ ఫెర్గూసన్ పేరిట ఉన్న వేగవంతమైన బంతి రికార్డను ఉమ్రాన్ మాలిక్ బద్ధలుకొట్టాడని కొనియాడుతున్నారు. ఉమ్రాన్ మాలిక్ ఫ్యూచర్ స్టార్ అవుతాడని అంచనా వేస్తున్నారు. భారత్‌కు ఇలాంటి బౌలర్లే అవసరమని అభిప్రాయపడుతున్నారు.


ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో top-5 fastest deliveries లో ఉమ్రాన్ మాలిక్ 154 కి.మీ/గం తొలిస్థానంలో ఉండగా.. ఫెర్గూసన్ 153.9 కి.మీ/గం రెండవ స్థానంలో ఉన్నాడు. 3, 4, 5వ స్థానాల్లోనూ ఉమ్రాన్ మాలిక్ కొనసాగుతుండడం గమనార్హం. కాగా ఆదిరాత్రి చెన్నై సూపర్ కింగ్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. చెన్నై 203 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు 189  పరుగులు మాత్రమే చేయగలిగారు. చెన్నై బౌలర్ ముకేష్ చౌదరీ 4 వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు.

Read more