Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో కొత్తగా 1,539 కరోనా కేసులు

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,539 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 20,07,730కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో  12 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 13,778 మంది మృతి చెందారు. ఏపీలో గత 24 గంటల్లో 1,140 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 14,448 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 


మరోవైపు కరోనా థర్డ్‌ వేవ్‌పై అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యుల బృందం గురువారం కేరళకు బయలుదేరి వెళ్లనుంది. ఈ బృందం వారం రోజుల పాటు కేరళలోనే ఉండి పరిస్థితులను పరిశీలిస్తుంది. ఇందులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బాబు.ఎ., ఏపీ వైద్య విధాన్‌ పరిషత్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌, ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సాంబశివారెడ్డితో పాటు ఇద్దరు ఎపిడమాలజిస్టులను ప్రభుత్వం నియమించింది. థర్డ్‌వేవ్‌ లక్షణాలు, వైరస్‌ ను ఎదుర్కోవడానికి ప్రజలు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement