గ్రేటర్‌లో కరోనా టెర్రర్‌..!

ABN , First Publish Date - 2020-06-07T10:54:24+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 152

గ్రేటర్‌లో కరోనా టెర్రర్‌..!

శనివారం ఒక్కరోజే 152 పాజిటివ్‌ కేసులు


ఎర్రగడ్డ/నేరేడ్‌మెట్‌/రామంతాపూర్‌/ఉప్పల్‌/అంబర్‌పేట/చిక్కడపల్లి/రాంనగర్‌/కవాడిగూడ/ముషీరాబాద్‌/ఎల్‌బీనగర్‌/చంపాపేట/ చాదర్‌ఘాట్‌/ పంజాగుట్ట/ పేట్‌బషీర్‌బాద్‌ జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 152 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారి కుంటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. పలువురు అనుమానితులను ఆయా ఆస్పత్రులకు తరలించి నమూనాలు సేకరించారు.


పంజాగుట్టలో వాచ్‌మన్‌కు...

యూసుపూగూడకు చెందిన వుద్ధుడి(65)కి కరోనా సో కింది. గాంధీ ఆస్పత్రికి తరలించారు. జవహార్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. 


కొంపల్లిలో వృద్ద్ధుడికి..

కొంపల్లి మాలకుంటలో నివసించే వృద్ధుడి(83)కి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడిని సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. 


ఉప్పల్‌ రాఘవేంద్రనగర్‌లో కిడ్నీ రోగికి..

ఉప్పల్‌ రాఘవేంద్రనగర్‌కు చెందిన మహిళ(54)కు వైరస్‌ నిర్ధారణ అయింది. ఆమె కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమె కుటుంబ సభ్యు లు ఇద్దరిని క్వారంటైన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 


 నేరేడ్‌మెట్‌లో మహిళా డాక్టర్‌కు..

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని సప్తగిరి కాలనీకి చెందిన మహిళా డాక్టర్‌కు పాజిటివ్‌ వచ్చింది. నిమ్స్‌ ఆస్పత్రిలో ఆమె డాక్టర్‌గా పనిచేస్తున్నారు. నిమ్స్‌ ఆస్పత్రిలో ఆమెకు చికత్సను అందిస్తున్నారు. ఆమె తల్లిని సప్తగిరికాలనీలో  హోం క్వారంటైన్‌లో ఉంచారు.


అంబర్‌పేటలో ఐదుగురికి..

అంబరపేట పీఎస్‌ పరిధిలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి.  బాగ్‌అంబర్‌పేట క్రౌన్‌ ఫంక్షన్‌హాల్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీ్‌సస్టేషన్‌ కానిస్టేబుల్‌(30), రెడ్‌బిల్డింగ్‌ సమీపంలో ఉంటున్న ఓ వృద్ధుడు(61), డీడీ కాలనీలో ఉంటున్న వ్యాపారి(47), అంబర్‌పేట డివిజన్‌ పటేల్‌నగర్‌లో వుంటున్న ఓ వ్యక్తి(50)కి కరోనా సోకింది. అంబర్‌పేట బాపునగర్‌లోకరోనా కరోనా సోకిన ఓ వ్యక్తి(54) శనివారం మృతిచెందాడు. 


కరోనా బారిన ఎస్‌ఐ దంపతులు 

చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో నివాసం ఉంటున్న ఓ ఎస్‌ఐ(34) అతని భార్య (30)కు కరోనా సోకింది. వీరిని అధికారులు చికిత్స నిమి త్తం నగరంలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 


ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఎనిమిది..

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో శనివారం ఒక్కరోజే ఎనిమిది కరోనా  కేసులు నమోదయ్యాయి. బోలక్‌పూర్‌  బాకారంలో వృద్ధుడి(85)కి పాజిటివ్‌ రావడంతో గాంఽధీ ఆస్పత్రికి తరలించారు. రాంనగర్‌ జెమిని కాలనీలో వ్యక్తి(59)కి పాజిటివ్‌ రావడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. బోలక్‌పూర్‌ పద్మశాలీ కాలనీకి చెందిన వృద్ధుడి(61)కి పాజిటివ్‌ వచ్చిందని బైబిల్‌హౌస్‌ యూ పీహెచ్‌సీ వైద్య అధికారి ఫరీనా సుల్తానా తెలిపారు.


 కవాడిగూడ భీమా మైదాన్‌ వాంబే కాలనీలో నివాసం ఉండే మహిళ(35)కు పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. ఆమె ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రాధమిక కాంటాక్ట్‌ అయిన ఆమె కుమారులు (17), (13)లకు కూడా శనివారం పాజిటివ్‌ వచ్చింది. వారిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త, అత్తని హోంక్వారంటైన్‌ చేశారు. కవాడిగూడ ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ నగర్‌లో నివాసం ఉంటూ గోషామహల్‌ పీఎస్‌ పరిఽధిలో విధులు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్‌(27)కు పాజిటివ్‌ వచ్చింది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇతను నివాసం ఉండే ఇంట్లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉంటున్న తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్లను హోం క్వారంటైన్‌ చేశారు. రెండో అంతస్తులో ఇతను నివాసం ఉంటున్నాడు. ఆ ఇంటిని కట్టడి చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భార్య పిల్లలు సమీపంలోని తల్లిగారి ఇంట్లో ఉంటున్నారు. బాగ్‌లింగంపల్లిలోని పోచమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న భర్త(34), భార్య (30)కు పాటిటివ్‌ వచ్చింది. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యాధికారి తెలిపారు. వీరు నివసించే పరిసరప్రాంతాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కట్టడి చేశారు. 


ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌లలో ఎనిమిది మందికి...

ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలో ఎనిమిది మందికి వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. వారిలో ఇద్దరు వైద్యులు కాగా ఇద్దరు కానిస్టేబుళ్లున్నారు. సరూర్‌నగర్‌ క్రాంతినగర్‌లో నివాసం ఉంటూ ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్‌ మెడికోగా పనిచేస్తోన్న వైదురాలి(24)కి పాజిటివ్‌ వచ్చింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమెతో పాటు ఇంట్లో ఉంటున్న తల్లి(45), సోదరి(20)లతోపాటు ఆరుగురిని(ఇంటి యజమాని కుటుంబ సభ్యులను) హోంక్వారంటైన్‌ చేశారు. 


రాజీవ్‌గాంధీనగర్‌లో కానిస్టేబుల్‌కు..

రాజీవ్‌గాంధీ నగర్‌లో నివాసం ఉంటూ ఉప్పల్‌ పీఎ్‌సలో పని చేస్తున్న కానిస్టేబుల్‌(35)కు పాజిటివ్‌ వచ్చింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కానిస్టేబుల్‌ ఇటీవల ఘట్‌కేసర్‌లో వలసకార్మికుల శిబిరంలో విధులు నిర్వహిస్తున్నాడు. 


శ్రీనివాసనగర్‌కాలనీలో వ్యక్తికి...

సరూర్‌నగర్‌ శ్రీనివాసనగర్‌ కాలనీకి చెందిన వ్యకి(32)కి పాజిటివ్‌ వచ్చింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడి భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇంటి యజమాని కుటుంబానికి చెందిన ఆరుగురిని హోం క్వారంటైన్‌ చేశారు.


మన్సూరాబాద్‌లోర కానిస్టేబుల్‌కు..

హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని మన్సూరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్‌ (32) ఉస్మానియా ఆస్పత్రి వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌లో ఉంచారు. 


వనస్థలిపురంలో వైద్యుడికి..

వనస్థలిపురం, శ్రీశ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటూ ఉస్మానియా ఆస్పత్రిలో కార్డియాలజిస్టుగా పని చేస్తున్న వైద్యుడి(38)కి పాజిటివ్‌ వచ్చింది. అతను మోహిదీపట్నంలో ఉంటున్నట్లు సమాచారం. రికార్డుల్లో శ్రీనివాసపురం కాలనీ చిరునామా ఉండడంతో ఇంటిని క్వారంటైన్‌ చేశారు.


చింతలకుంట ల్యాబ్‌ టెక్నీషియన్‌కు..

చింతలకుంటలో నివాసం ఉంటూ నారాయణగుడలోని ఐపీఎంలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యకి ్త(36)కి వైరస్‌ సోకింది. గాంధీ ఆస్పత్రికి తరలించారు.


చంపాపేట ఏడబస్తీలో కిరాణా దుకాణ  దారుడికి..

చంపాపేట ఏడబస్తీలో కిరాణా దుకాణం నడుపుతున్న వ్యక్తి(50)కి పాజిటివ్‌ రావడంతో శుక్రవారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి భార్య, ముగ్గురు పిల్లలను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 


కరోనాతో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి మృతి

కరోనా బారిన పడిన కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యాధికారి తండ్రి మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యాధికారికి, ఆయన తండ్రికి ఇటీవల వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. ఆ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న తండ్రి(91) శనివారం ఉదయం మృతి చెందారు.


గోల్నాక శాంతినగర్‌లో వికలాంగుడు..

గోల్నాక శాంతినగర్‌కు చెందిన వికలాంగుడు(45) కరోనాకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. అతడికి ఈ నెల 1న గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. అతడు మృతి చెందిన విషయాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపి శనివారం అంబర్‌పేట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అతడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన వెంటనే అధికారులు కుటుంబ సభ్యులు ఐదుగురిని హోంక్వారంటైన్‌ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులందరికీ ఇప్పటికైనా వైద్య పరీక్షలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


అంబర్‌పేటలో వ్యక్తి...

అంబర్‌పేట బాపునగర్‌లోకరోనా కరోనా సోకిన ఓ వ్యక్తి(54) శనివారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లోఉన్నారు.


మలక్‌పేటలో ఐదుగురికి... 

మలక్‌పేటలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురికి శనివారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మలక్‌పేట సలీంనగర్‌లో నివాసం ఉంటూ ఉస్మానియా ఆస్పత్రిలో హౌజ్‌ సర్జన్‌గా చేస్తున్న వైద్యురాలి(25)కి వైరస్‌ సోకింది. ఐదుగురు కుటుంబీకులను క్వారంటైన్‌కు పంపారు. ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్‌ బస్తీలో నివాసముంటున్న ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో   వేర్వేరు కుటుంబాలకు చెందిన వృద్ధురాలు(60), మహిళ(40), వ్యక్తి(52) ఉన్నారు. వృద్ధురాలి ఇంట్లో ఐదుగురిని, మహిళ ఇంట్లో  11 మందిని, వ్యక్తి ఇంట్లో 10మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ చేశారు. చంచల్‌గూడకు చెందిన మహిళ(35)కు పాజిటివ్‌ వచ్చింది. ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ చేశారు. 

Updated Date - 2020-06-07T10:54:24+05:30 IST