యూపీలో 29 లక్షల మందికి కరోనా పరీక్షలు: సీఎం

ABN , First Publish Date - 2020-08-09T03:37:31+05:30 IST

యూపీలో 29 లక్షల మందికి కరోనా పరీక్షలు: సీఎం

యూపీలో 29 లక్షల మందికి కరోనా పరీక్షలు: సీఎం

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ యూపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యం యూపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1.51 లక్షల కోవిడ్ -19 పడకలు ఏర్పాటు చేశామని, 29 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేసినట్లు యూపీ యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.


ప్రతి జిల్లాలో కోవిడ్ -19 ఆస్పత్రులను నెలకొల్పడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక నిధుల నుంచి 450 కోట్ల రూపాయలను ఉపయోగించుకుందని, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు 1,51,000 పడకలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం తెలిపారు. రెండు నెలల క్రితం ఒక టెస్టింగ్ ల్యాబ్ ఉందని, కానీ ఈ సంఖ్య 32కి పెరిగిందని, రాష్ట్రంలో 29.60 లక్షల కోవిడ్ -19 పరీక్షలు జరిగాయని  ఆదిత్యనాథ్ తెలిపారు. కోవిడ్ -19 మరణాల రేటును 1 శాతం కన్నా తక్కువకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని మీరట్ జోన్ అధికారులను కోరినట్లు ఆయన ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2020-08-09T03:37:31+05:30 IST