Abn logo
Jul 1 2020 @ 10:12AM

ఘజియాబాద్‌ను వ‌ణికిస్తున్న‌ క‌రోనా... 24 గంట‌ల్లో 151 కొత్త కేసులు

ఘజియాబాద్: యూపీలోని ఘజియాబాద్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ మ‌రింత‌గా వ్యాప్తిచెందుతోంది. జిల్లాలో రోజురోజుకు కోవిడ్ -19 సోకిన రోగుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 151 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కోవిడ్ -19 సోకిన రోగుల సంఖ్య 1615గా ఉండ‌గా, వీరిలో 738 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. 822 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 55 మంది మృతిచెందారు‌. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోక‌న్నా ఘ‌జియాబాద్‌లో అత్యధికంగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ గుప్తా మాట్లాడుతూ కోవిడ్ -19 సోకిన రోగుల సంఖ్య పెరుగుతున్న తీరు ఆందోళ‌న‌క‌రంగా మారింది. క‌రోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆరోగ్య శాఖ అన్నిర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ద‌న్నారు. 

Advertisement
Advertisement
Advertisement