రౌడీల వేట.. 3 రోజుల్లో 150 మంది అరెస్టు

ABN , First Publish Date - 2020-11-13T14:22:02+05:30 IST

దీపావళి పండుగ సందర్భంగా

రౌడీల వేట.. 3 రోజుల్లో 150 మంది అరెస్టు

చెన్నై : దీపావళి పండుగ సందర్భంగా బంగారు గొలుసుల చోరీ, దారిదోపిడీలు, దుకాణాల్లో చోరీలు నిరోధిం చటంలో భాగంగా గ్రేటర్‌ చెన్నై పోలీసులు మూడు రోజులుగా రౌడీలవేట ప్రారంభించారు. వారెంట్లు జారీ అయి పరారీలో ఉన్న పాత నేరస్థులు సహా 150 మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై పోలీసు కమిషనర్‌ మహేష్‌కుమార్‌ అగర్వాల్‌ ఉత్తర్వుల మేరకు సబర్బన్‌ ప్రాంతాల్లో పోలీసులు రౌడీల కోసం ముమ్మరంగా గాలించారు. 


ఈనెల తొమ్మిదిన సౌత్‌చెన్నై ప్రాంతంలో 20 మంది, చెన్నై వెస్ట్‌జోన్‌లో 12 మంది రౌడీలను అరెస్టు చేశారు. బుధవారం రాత్రి సౌత్‌ చెన్నై ప్రాంతంలో 33 మంది రౌడీలను అరెస్టు చేశారు. ఇదే విధంగా టి.నగర్‌లో 28 మంది, సెయింట్‌థామస్‌ మౌంట్‌లో 23 మంది, కీల్పాక్‌, అడయార్‌, ట్రిప్లికేన్‌ ప్రాంతాల్లో 19 మంది, మైలాపూరులో 10 మంది రౌడీలను అరెస్టు చేసినట్టు కమిషనర్‌ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు.

Updated Date - 2020-11-13T14:22:02+05:30 IST