జర జాగ్రత్త.. ఏటీఎం సెంటర్‌లో మోసం.. డెబిట్ కార్డులను తారుమారు చేసి రూ.1.60 లక్షలు కొట్టేశాడు..

ABN , First Publish Date - 2022-03-17T16:32:19+05:30 IST

అతను డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు.. డబ్బులు తీయడం రాకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తిని సహాయం అడిగాడు..

జర జాగ్రత్త.. ఏటీఎం సెంటర్‌లో మోసం.. డెబిట్ కార్డులను తారుమారు చేసి రూ.1.60 లక్షలు కొట్టేశాడు..

అతను డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు.. డబ్బులు తీయడం రాకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తిని సహాయం అడిగాడు.. ఆ వ్యక్తికి పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీయమన్నాడు.. డబ్బులు తీసిన తర్వాత ఆ వ్యక్తి ఏటీఎం కార్డు మార్చి ఇచ్చాడు.. ఆ తర్వాత రూ.1.60 లక్షలు కొట్టేశాడు.. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. 


హర్యానాలోని పాని‌పట్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి డబ్బులు తీసేందుకు బుధవారం ఉదయం ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు తీసేందుకు అక్కడే ఉన్న ఓ వ్యక్తిని సహాయం అడిగాడు. ఆ వ్యక్తికి పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీయమన్నాడు. డబ్బులు తీసిన తర్వాత ఆ వ్యక్తి దినేష్ ఏటీఎం కార్డు కాకుండా వేరే ఏటీఎం కార్డు ఇచ్చాడు. సరిగ్గా చూసుకోకుండా దినేష్ ఆ కార్డు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. సాయంత్రానికి దినేష్ మొబైల్‌కు వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. 


రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.5 వేలు, రూ.50 వేలు అకౌంట్ నుంచి విత్‌డ్రా అయినట్టు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో షాకైన దినేష్ వెంటనే కార్డు బ్లాక్ చేయించాడు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-03-17T16:32:19+05:30 IST