అటవీ హక్కుదారులకు 150 రోజుల ఉపాధి

ABN , First Publish Date - 2021-05-06T04:29:46+05:30 IST

ఏజెన్సీలో అటవీ హక్కులు పొందిన గిరిజనులకు 150 రోజుల ఉపాధి పనులు కల్పించాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సూచించారు. విశాఖపట్నంలోని ఐటీడీఏ పీవో క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఉపాధి హామీ ఏపీడీలు, ఏజెన్సీ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అటవీ హక్కుదారులకు 150 రోజుల ఉపాధి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌

పాడేరు, మే 5: ఏజెన్సీలో అటవీ హక్కులు పొందిన గిరిజనులకు 150 రోజుల ఉపాధి పనులు కల్పించాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సూచించారు. విశాఖపట్నంలోని ఐటీడీఏ పీవో క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఉపాధి హామీ ఏపీడీలు, ఏజెన్సీ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ హక్కు పత్రాలు పొందిన 80 వేల కుటుంబాలకు 150 రోజుల ఉపాధి పనిదినాలు కల్పించాలని ఆదేశించారు. పనులు చేసిన కూలీల వేతనాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కూలీ సొమ్మును లబ్థిదారుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. గత నెలలో ఏజెన్సీలో రూ.24 కోట్ల పనులు చేపట్టామన్నారు.  జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి పనులు కల్పించాలని స్పష్టం చేశారు. ఉపాధి కూలీ రోజూ వారీ వేతనం రూ.237 నుంచి రూ.245కు ప్రభుత్వం పెంచిందన్నారు. జి.మాడుగల  సిబ్బందిని ఎన్నిసార్లు హెచ్చరించినా పనితీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీడీ వి.రాధాకృష్ణ, ఏజెన్సీ మండలాల ఎంపీడీవోలు, ఏపీవో, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-05-06T04:29:46+05:30 IST