15వేల మంది ఉపాధ్యాయుల నియామకాలు

ABN , First Publish Date - 2021-12-12T17:58:37+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు 15వేల మందిని నియమించుకుంటామని ప్రాథమిక విద్యాశాఖ మం త్రి బీసీ నాగేశ్‌ ప్రకటించారు. శనివారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడు

15వేల మంది ఉపాధ్యాయుల నియామకాలు

బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు 15వేల మందిని నియమించుకుంటామని ప్రాథమిక విద్యాశాఖ మం త్రి బీసీ నాగేశ్‌ ప్రకటించారు. శనివారం  ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను నియంత్రిస్తామన్నారు. కల్యాణ కర్ణాటక పరిధిలో 5వేల మందితోపాటు రాష్ట్రమంతటా మిగిలిన జిల్లాల్లో మరో 10వేల మందిని నియమిస్తామన్నారు. ఇందుకోసం త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. ఉపాధ్యాయుల కొరత నియంత్రించేందుకు 23వేల మంది గెస్ట్‌లుగా నియమించుకున్నామని, మరో 4వేల మంది అదనంగా నియమించుకునేందుకు ప్రక్రియ సాగుతోందన్నారు. 

Updated Date - 2021-12-12T17:58:37+05:30 IST