జిల్లాలో 15 క్వారంటైన్‌ కేంద్రాలు

ABN , First Publish Date - 2020-03-29T09:45:38+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానిత రోగులను వైద్య పరిశీనలో ఉంచేందుకు 15 ప్రైవేటు క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

జిల్లాలో 15 క్వారంటైన్‌ కేంద్రాలు

మొత్తం 1703 పడకలు ఏర్పాటు


గుంటూరు (మెడికల్‌), నరసరావుపేట, మార్చి 27: జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానిత రోగులను వైద్య పరిశీనలో ఉంచేందుకు 15 ప్రైవేటు క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇటీవల విదేశాల నుంచి సుమారు 1200కిపైగా వ్యక్తులు జిల్లాకు వచ్చారు.


వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. వీరిలో మొదటి గ్రూప్‌ మినహా మిగిలిన రెండు గ్రూపుల్లో ఉన్న వారిని కూడా ఈ క్వారంటైన్‌ సెటర్లకు తరలించే అవకాశం ఉందని అదికారులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని నేరుగా ప్రభుత్వాస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తారు. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన ఇతర వ్యక్తులను క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తారు. 


జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి..


ప్రాంతం పడకలు

 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 200

ఎన్నారై జనరల్‌ హాస్పిటల్‌ 400

వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీ 84

బాలయోగి గురుకుల పాఠశాల, అమరావతి 100

హెచ్‌ఆర్‌డీ సెంటరు, బాపట్ల 100

 కాటూరి మెడికల్‌ కాలేజీ 52

నరసరావుపేట ఇంజనీరింగ్‌ కాలేజి, యలమంద 150

కోటప్పకొండ టీటీడీపీ 60

సెయింట్‌ గ్జేవియర్‌ ఆస్పత్రి, వినుకొండ 60

న్యూటన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ఆకురాజుపల్లి 121

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, యడ్లపాడు                                                                     45

తాడికొండలోని రీజనల్‌ హెల్త్‌ సెంటర్‌ 20

చలపతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ 21

ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ ఇంజనీరింగ్‌, చౌడవరం 200

Updated Date - 2020-03-29T09:45:38+05:30 IST