Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 21 2021 @ 16:53PM

15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం

జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం కేబినెట్ మళ్లీ కొలువుదీరింది. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయానికి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఇందులో ఇది వరకు ముగ్గురు మంత్రులుగా ఇది వరకే పని చేసిన వారు ఉండగా.. 12 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఉన్న రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ అజయ్ మాకెన్ ముఖ్యులుగా పాల్గొన్నారు.


రాజస్తాన్ మంత్రి వర్గం మొత్తం రాజీనామాసచిన్ పైలట్ తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 16 నెలల తర్వాత క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు పూనుకున్నారు. ఈ నూతన క్యాబినెట్‌లో సచిన్ పైలట్ మద్దతుదారులకు ఎక్కువ ప్రాధాన్యమే లభించింది. రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్‌లకు తిరిగి మంత్రి పదవులు పొందారు. వీరితో పాటు బ్రిజేంద్ర సింగ్ ఓలా, మేమారన్ చౌదరి, మురీలాల్ మీనాకు మంత్రి వర్గంలో నూతనంగా చోటు దక్కింది.

Advertisement
Advertisement