15 అడుగుల కింగ్‌ కోబ్రా..

ABN , First Publish Date - 2021-04-22T07:43:46+05:30 IST

ఇది కింగ్‌ కోబ్రా(రాచ నాగు). రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఏపీ జెన్‌కో కాలనీలో సంచరిస్తూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

15 అడుగుల కింగ్‌ కోబ్రా..

మోతుగూడెం(తూర్పు గోదావరి జిల్లా ) ఏప్రిల్‌ 21: ఇది కింగ్‌ కోబ్రా(రాచ నాగు). రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఏపీ జెన్‌కో కాలనీలో సంచరిస్తూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. జెన్‌కో అధికారులు రాజమహేంద్రవరం వన్యప్రాణుల సంరక్షణ విభాగ క్షేత్రాధికారికి తెలియజేయడంతో అక్కడి నుంచి స్నేక్‌ హెల్పర్స్‌ బృంద సభ్యులు ఈశ్వర్‌, సాయి వచ్చి కింగ్‌ కోబ్రాను పట్టేశారు. ఇది 15 అడుగుల పొడవుంది. వయసు నాలుగేళ్లని భావిస్తున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ పామును లక్కవరం రేంజ్‌ పరిధిలో వదిలేస్తామని డీఆర్వో జాన్సన్‌తెలిపారు.

Updated Date - 2021-04-22T07:43:46+05:30 IST