నేటి నుంచి 14వ విడత ఉచిత రేషన్‌

ABN , First Publish Date - 2020-10-20T06:49:20+05:30 IST

కొవిడ్‌-19 నేపథ్యంలో 14వ విడత ఉచిత రేషన్‌ పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభి స్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల

నేటి నుంచి 14వ విడత ఉచిత రేషన్‌

ఏలూరు సిటీ, అక్టోబరు 19 : కొవిడ్‌-19 నేపథ్యంలో 14వ విడత ఉచిత రేషన్‌ పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభి స్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఎన్‌.సుబ్బరాజు సోమవారం తెలిపారు. 2,200 చౌక డిపోలలో మొత్తం 12,83,678 కార్డుదారుల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం, ప్రతీ కార్డుకు కిలో శనగలు ఉచితంగా అందిస్తారు.


కొవిడ్‌ నిబంధనలు పాటించి వీటిని అందజేయాలని డీలర్లను ఆదే శించారు. చౌక దుకాణాలకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా 17 వేల టన్నుల బియ్యం, 1,260 టన్నుల శనగలు సరఫరా  సరఫరా చేసినట్లు సివిల్‌ సప్లయిస్‌ డిఎం డి.రాజు తెలిపారు. 


Updated Date - 2020-10-20T06:49:20+05:30 IST