14,989 కొత్త కేసులు

ABN , First Publish Date - 2021-03-04T07:14:55+05:30 IST

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 14,989 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ముఖ్యంగా.. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, తమిళనాడు

14,989 కొత్త కేసులు

మహారాష్ట్రలో 7863 మందికి పాజిటివ్‌


న్యూఢిల్లీ, మార్చి 3: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 14,989 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ముఖ్యంగా.. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నాయి. వీటితోపాటు ఢిల్లీ, హరియాణా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నమోదైన మొత్తం కేసుల్లో 85.95% కేసులు ఈ ఆరు రాష్ట్రాలవే కావడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 7,863 కేసులు నమోదు కాగా.. తర్వాతి స్థానంలో కేరళ(2,938 కేసులు) నిలిచింది. పంజాబ్‌లో 729 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, కేరళ, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, జమ్ముకశ్మీర్‌కు కేంద్రం త్రిసభ్య బృందాలను పంపింది. కాగా.. బుధవారంనాటికి దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,70,126గా ఉంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది కేవలం 1.53ు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం నడుమ 13,123 మంది కరోనా పేషెం ట్లు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 98 మంది మరణించారు.  

Updated Date - 2021-03-04T07:14:55+05:30 IST