తమిళనాడులో ఒక్కరోజే 1458 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-07T15:58:02+05:30 IST

రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గత ఐదురోజులుగా వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు

తమిళనాడులో ఒక్కరోజే 1458 కరోనా కేసులు

  • చెన్నైలో 1146 
  • డిశ్చార్జి అయినవారు 633 మంది
  • 19 మంది మృతి

చెన్నై : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గత ఐదురోజులుగా వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇదే సరళి కొనసాగితే త్వరలో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండు వేలకు చేరే అవకాశాలున్నాయి. ఇక రాష్ట్రంలో శనివారం 1458 పాజిటివ్‌ కేసులు బయపడడంతో ఇప్పటిదాకా కరోనా తాకిడికి గురైనవారి సంఖ్య 30,152కు చేరింది. ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో  రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 1458 పాజిటివ్‌ కేసుల్లో 1423 మంది రాష్ట్రానికి చెందినవారని, మగిలిన వారు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ (ఇద్దరు), కర్టాటకవాసులని పేర్కొన్నారు.


చెన్నైలో 1146 పాజిటివ్‌ కేసులు బయటపడడంతో ఇప్పటిదాకా కరోనా తాకిడికి గురైనవారి సంఖ్య 20,993కు చేరిందని తెలిపారు. శనివారం సాయంత్రం వరకూ కరోనా తాకిడికి గురైన వారిలో 633 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జి అయినవారి సంఖ్య 16,395కు చేరింది. 


రాష్ట్రంలోని 44 ప్రభుత్వ ఆస్పత్రులు, 30 ప్రైవేటు ల్యాబ్‌లలో శనివారం 16,022 మందికి  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటిదాకా 5,76,695 శాంపిల్స్‌ను పరీక్షించారు. రాష్ట్రంలో కరోనా సోకినవారిలో 18,689 మంది పురుషులు, 11446 మంది మహిళలు, 17మంది హిజ్రాలున్నారు. అదే విధంగా శనివారం మధ్యాహ్నం వరకూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 10మంది, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో  మొత్తం మృతుల సంఖ్య 251కు పెరిగింది.

Updated Date - 2020-06-07T15:58:02+05:30 IST