‘టెన్త్‌’ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

ABN , First Publish Date - 2022-05-22T05:57:28+05:30 IST

జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరిగే 83 పరీక్ష కేంద్రాల వద్ద రేపటి నుంచి 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. రేపటి నుంచి జూన్‌ 1 వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలు జరిగే సమయంలో సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని సూచించారు.

‘టెన్త్‌’ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

సిద్దిపేట క్రైం, మే 21 : జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరిగే 83 పరీక్ష కేంద్రాల వద్ద రేపటి నుంచి 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. రేపటి నుంచి జూన్‌ 1 వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలు జరిగే సమయంలో సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడటం నిషేధమని వెల్లడించారు. పరీక్ష సమయంలో పోలీస్‌ అధికారులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తారని పేర్కొన్నారు. పోలీ్‌సస్టేషన్‌ నుంచి పరీక్ష పత్రాలను కేంద్రానికి తరలించే సమయంలో పోలీసు రక్షణ ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని సూచించారు. 


విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

సిద్దిపేట అర్బన్‌/గజ్వేల్‌, మే 21: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపో మేనేజర్‌ శ్రీనివా్‌సరావు, సిద్దిపేట డిపో మేనేజర్‌ కిషన్‌రావు తెలిపారు. హాల్‌టికెట్‌ కలిగిన విద్యార్థులు బస్‌పాస్‌ రెన్యూవల్‌ లేకపోయినా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చని వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యం కోసం ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నట్టు తెలియజేశారు. విద్యార్థులు ఎక్కడ ఆపినా బస్సు ఎక్కించుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. గజ్వేల్‌ డిపో పరిధిలో గజ్వేల్‌ బస్‌స్టాండ్‌ నుంచి ఎడ్యూకేషనల్‌ హాబ్‌ వరకు రెండు బస్సులు, జగదేవ్‌పూర్‌ రూట్‌లో ఒక బస్సు. జేబీఎస్‌ రూట్‌లో రెండు బస్సులు, సంగారెడ్డి రూట్‌లో రెండు బస్సులు నడిపిస్తున్నట్టు తెలిపారు. గజ్వేల్‌ పరిధిలో అత్యవసర సహాయం కోసం 8008578518(నర్సింలు), 9885047123(శ్రీనివాస్‌), 7207107168(సంపత్‌), 8885155571(అశోక్‌), 6309642866(ఎస్‌టీఐ), 9959226270(డిపో మేనేజర్‌)ను సంప్రదించాలని సూచించారు. సిద్దిపేట పరిధిలో విద్యార్థులు సాయం కోసం 9959226271, 7382804082, 9491510310 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2022-05-22T05:57:28+05:30 IST