ఎరువుల సబ్సిడీకి 1.41 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-01-18T06:48:03+05:30 IST

రైతులకు ఎరువులను మార్కెట్‌ రేటు కన్నా తక్కువ ధరకు

ఎరువుల సబ్సిడీకి 1.41 లక్షల కోట్లు

న్యూఢిల్లీ, జనవరి 17: రైతులకు ఎరువులను మార్కెట్‌ రేటు కన్నా తక్కువ ధరకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎరువుల కంపెనీలకు ఈ లోటును పూడ్చేందుకు రానున్న బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీగా రూ.1.41 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలుత రూ.80 వేల కోట్లే కేటాయించాలని ప్రభుత్వం భావించిందని, సాగు చట్టాలపై అన్నదాతల వ్యతిరేకత, ఎన్నికల్లో రైతుల ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో భారీగా పెంచాలని నిర్ణయించిందని పేర్కొన్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 


Updated Date - 2022-01-18T06:48:03+05:30 IST