Shocking : హైదరాబాద్‌లో ఒక్క టూ వీలర్‌పై ఇన్ని చలనాలా..!

ABN , First Publish Date - 2021-11-20T12:23:22+05:30 IST

నాలుగు రోజుల క్రితం 117 చలాన్లు ఉన్న వాహనదారుడిని పట్టుకున్న

Shocking : హైదరాబాద్‌లో ఒక్క టూ వీలర్‌పై ఇన్ని చలనాలా..!

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : నాలుగు రోజుల క్రితం 117 చలాన్లు ఉన్న వాహనదారుడిని పట్టుకున్న ఆబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు తాజాగా 141 చలాన్లున్న మరో వాహనదారుడిని గుర్తించారు. ఆబిడ్స్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో జీపీవో ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. చిరాగ్‌ ఆలీలైన్‌ ప్రాంతానికి చెందిన ఫిరోజ్‌ ఆలీ బాటా జంక్షన్‌ నుంచి ఆబిడ్స్‌ జీపీవో వైపు వస్తుండగా అతడి వాహనాన్ని ఆపి చలాన్లు పరిశీలించారు. 141  చలాన్లు, రూ. 33,265 జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికప్పుడు రూ. 10 వేలు ఫైన్‌ కట్టించుకుని వదిలేశారు.

Updated Date - 2021-11-20T12:23:22+05:30 IST