ఢిల్లీలో కొత్తగా 1,404 కోవిడ్ కేసులు, 16 మరణాలు

ABN , First Publish Date - 2020-08-09T20:51:55+05:30 IST

దేశ రాజధానిలో కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,404 కోవిడ్ కేసులు..

ఢిల్లీలో కొత్తగా 1,404 కోవిడ్ కేసులు, 16 మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,404 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, 16 మంది మృత్యువాత పడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆదివారంనాడు తెలిపారు. ఇంతవరకూ రాష్ట్రంలో 1,44,127 కోవిడ్ కేసులు నమోదు కాగా, ఇందులో 10,668 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 4,098కి చేరింది.


'కోవిడ్-19 కేసులు పెరగడానికి ఢిల్లీ బయట నుంచి అనేక మంది ఇక్కడ పరీక్షలు చేయించుకునేందుకు వస్తుండటమే కారణం. దీంతో పాజిటివ్ కేసుల లెక్క పెరుగుతోంది. అలా కాకుండా ఉండే ఢిల్లీలో కోవిడ్-19 కేసుల ట్రెండ్ తగ్గుముఖం దిశగానే ఉండేది' అని సత్యేంద్ర జైన్ అన్నారు.


ఆసక్తికరంగా, గడచిన 24 గంటల్లో దేశంలో నమోదైన కేసులు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి. 64,399 కేసులు నమోదయ్యాయి. ఇదే ఒకరోజు అత్యధిక నమోదు. ఒక్కరోజులోనే 861 మరణాలు చోటుచేసుకోవడంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 43,379కి చేరింది.

Updated Date - 2020-08-09T20:51:55+05:30 IST