Advertisement
Advertisement
Abn logo
Advertisement

14ఏళ్ల బాలుడు బస్‌స్టాప్‌లో ఉండగా.. కారులో వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరపడంతో చివరికి..

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకి తూటాకు 14ఏళ్ల బాలుడు బలయ్యాడు. బస్సు కోసం బస్టాండ్‌లో ఎదురుచూస్తుండగా.. అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ప్రాంతంలో ఉన్న బస్టాండ్‌లో 14ఏళ్ల సమీర్ జెఫర్సన్ సోమవారం మధ్యాహ్నం వేచి చూస్తున్నాడు. ఈ సమయంలో అక్కడకు కారులో వచ్చిన ఇద్దరు దుండగులు.. అతడిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో సమీర్ అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే.. సమీర్‌ను కారులో వెంబడించిన దుండగులు.. అతడిని కాల్చి చంపారు. విషయం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. దుండగులు 35 రౌండ్లు కాల్పులు జరిపినట్లు గుర్తించామన్నారు. అంతేకాకుండా ఆ దుండగులను చూసిన వారెవరైనా ఉంటే.. సమాచారం చెప్పాలని కోరారు. Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement