14 ఏళ్ల బాలికను 19 ఏళ్ల యువతిగా చిత్రీకరించి..

ABN , First Publish Date - 2022-01-26T17:37:09+05:30 IST

14 ఏళ్ల బాలికను తల్లి, అమ్మమ్మతో కలిసి ఓ ముఠా రూ.5లక్షలకు అమ్మకానికి పెట్టిన ఘటనలో బాలికను 19 ఏళ్ల మేజర్‌గా చిత్రీకరించేదందుకు...

14 ఏళ్ల బాలికను 19 ఏళ్ల యువతిగా చిత్రీకరించి..

నకిలీ ఆధార్‌తో బురిడీ కొట్టించే యత్నం


హైదరాబాద్‌ సిటీ: 14 ఏళ్ల బాలికను తల్లి, అమ్మమ్మతో కలిసి ఓ ముఠా రూ.5లక్షలకు అమ్మకానికి పెట్టిన ఘటనలో బాలికను 19 ఏళ్ల మేజర్‌గా చిత్రీకరించేదందుకు ఈ ముఠా ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించి అందులో 19 ఏళ్లు ఉన్నట్లుగా చూపించారు. అనుమానం వచ్చిన రాచకొండ పోలీసులు బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించారు. నిపుణులైన వైద్యులు ఏజ్‌ డిటర్మినేషన్‌ టెస్టు నిర్వహించి, బాలిక మేజర్‌ కాదు.. 14 ఏళ్ల బాలిక అని సైంటిఫిక్‌గా నిర్ధారించారు. దాంతో ఆ ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాలో కొంతమందిపై ఇప్పటికే మైలార్‌దేవ్‌పల్లి స్టేషన్‌లో కేసులున్నట్లు జైలుకు వెళ్లివచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని మహిళలు, యువతులను, బాలికలను విక్రయించి, పెళ్లిపేరుతో ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు. నిందితులపై పీడీయాక్టు నమోదు చేస్తామని వెల్లడించారు.

Updated Date - 2022-01-26T17:37:09+05:30 IST