Heavy rain forecast: 14 జిల్లాలకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2022-08-27T13:31:26+05:30 IST

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో 14 జిల్లాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఐదు రోజులపాటు భారీ, అతిభారీ వర్షాలు

Heavy rain forecast: 14 జిల్లాలకు భారీ వర్ష సూచన

                                           - ఐదు రోజుల వరకు కొనసాగే అవకాశం


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 26: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో 14 జిల్లాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఐదు రోజులపాటు భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని, చెన్నై, తిరువళ్లూర్‌ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల శుక్రవారం ఉదయం నుంచే తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry) రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, తేని, దిండుగల్‌, ఈరోడ్‌, కరూర్‌, తిరుచ్చి, సేలం, నామక్కల్‌, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూర్‌, వేలూరు జిల్లాల్లో ఐదు రోజుల వరకు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 24 గంటల్లో గరిష్ఠంగా బందలూరులో 9, సూలగిరిలో 8, ఆవడి, కోవిల్‌పట్టి, ఎడప్పాడి ప్రాంతాల్లో 7 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. కన్నియాకుమారి, నాగపట్టణం, తూత్తుకుడి తదితర దక్షిణ, కోస్తా జిల్లాలు, శ్రీలంక(Sri Lanka)ను ఆనుకొని ఉన్న పశ్చిమ బంగాళాఖాతం సముద్ర ప్రాంతాల్లో గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నందు వల్ల జాలర్లు ఈ ప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Updated Date - 2022-08-27T13:31:26+05:30 IST