Jul 27 2021 @ 13:43PM

Raj Kundra: రాజ్ కుంద్రాకు హైకోర్ట్ షాక్... కస్టడీ పొడిగింపు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై హైకోర్టు షాకిచ్చింది. జూలై 19న రాజ్ కుంద్రాను పోర్న్ రాకెట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగ‌ళ‌వారంతో ఆయ‌న క‌స్ట‌డీ ముగుస్తుంది. ఆయ‌న బెయిల్ కోసం అప్పీలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన తాజా విచార‌ణ‌లో ముంబై హైకోర్టు  రాజ్ కుంద్రాకు బెయిల్ ఇవ్వ‌లేదు. పిటిష‌న్‌ను తిర‌స్క‌రిస్తూ 14 రోజుల పాటు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపారు. 

ముంబై అంధేరిలో రాజ్ కుంద్రా వియాన్ ఇండ‌స్ట్రీస్‌లో పోలీసులు సోదాలు జ‌రిపిన‌ప్పుడు సీక్రెట్ అల్మ‌రాలో ఆర్థిక లావాదేవీలు, క్రిప్టో క‌రెన్సీకి సంబంధించిన ప‌త్రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ కేసులో ఇంకా ఎవ‌రెవ‌రికీ లింకులున్నాయి అనే వివ‌రాల‌ను పోలీసులు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాగే ఫోర్నోగ్ర‌ఫీలో భాగ‌మైన వారిని ప్ర‌శ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టికే షెర్లిన్ చోప్రాకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేయ‌డం దుమారం రేపుతుంది.