పాకిస్థాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 139 మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-10-20T08:17:40+05:30 IST

కరోనా నేపథ్యంలో పాకిస్థాన్‌లో చిక్కుకున్న 139 మంది భారతీయులు నెలల తర్వాత తిరిగి తమ మాతృభూమికి

పాకిస్థాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 139 మంది భారతీయులు

అట్టారి, పంజాబ్: కరోనా నేపథ్యంలో పాకిస్థాన్‌లో చిక్కుకున్న 139 మంది భారతీయులు నెలల తర్వాత తిరిగి తమ మాతృభూమికి చేరుకున్నారు. అట్టారి-వాఘా బోర్డర్ ద్వారా సోమవారం భారతీయులు భారత్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో నెలల తరువాత తిరిగి తమ దేశానికి చేరుకోవడం ఆనందంగా ఉందని భారతీయులు తెలిపారు. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న వారిలో అనేక మంది తమ బంధువులను కలిసేందుకు వెళ్లి చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క సొంత వాహనం కలిగి ఉన్న భారతీయులు పాకిస్థాన్ నుంచి భారత్‌కు నేరుగా రావొచ్చని ఇండియన్ హై కమిషన్ వెల్లడించింది. కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారినే అధికారులు దేశంలోకి అనుమతిస్తున్నట్టు తెలుస్తోంది. 


పాకిస్థాన్‌లో చిక్కుకున్న అనేక మంది భారతీయులు ఇప్పటికే అట్టారి-వాఘా బోర్డర్ ద్వారా భారత్‌కు చేరుకున్నారు. సెప్టెంబర్ 15న 363 మంది నోరి(నో అబ్జెక్షన్ టు రిటర్న్ టు ఇండియా) వీసా హోల్డర్లు, 37 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చారు. మరోపక్క భారత్‌లో చిక్కుకున్న పాకిస్థానీలు కూడా ఇదే విధంగా తమ మాతృభూమికి చేరుకుంటున్నారు.

Updated Date - 2020-10-20T08:17:40+05:30 IST