135 మంది భారతీయ సైనికులకు యూఎన్ మెడల్స్

ABN , First Publish Date - 2021-06-16T02:53:48+05:30 IST

ఆఫ్రికా దేశం సూడాన్‌లో శాంతి స్థాపన కోసం కృషి చేసిన 135 మంది భారతీయ సైనికులకు అరుదైన గౌరవం దక్కింది.

135 మంది భారతీయ సైనికులకు యూఎన్ మెడల్స్

సూడాన్: ఆఫ్రికా దేశం సూడాన్‌లో శాంతి స్థాపన కోసం కృషి చేసిన 135 మంది భారతీయ సైనికులకు అరుదైన గౌరవం దక్కింది. వీరందరికీ యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్ (యూఎన్ఎమ్ఐఎస్ఎస్) నుంచి పతకాలు లభించాయి. దక్షిణ సూడాన్‌లో వారు చేసిన గొప్ప సేవలకు గుర్తింపుగా ఈ పతకాలు అందించినట్లు అధికారులు ప్రకటించారు. వీరితోపాటు శ్రీలంకకు చెందిన 103 మంది బ్లూ బెరెట్స్‌కు కూడా పతకాలు లభించాయి.  ఇది శ్రీలంక వాయుసేనకు చెందిన యూనిట్. ప్రపంచం మొత్తంలో శాంతి స్థాపన కోసం చేసిన 49 ఆపరేషన్లలో భారత సైనికులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లలో 150 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2021-06-16T02:53:48+05:30 IST