మరో 131 మొబైల్‌ రైతుబజార్లు

ABN , First Publish Date - 2020-03-31T09:05:13+05:30 IST

రాష్ట్రంలో కొత్త గా మరో 131 మొబైల్‌ రైతుబజార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యు మ్న వెల్లడించారు. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల

మరో 131 మొబైల్‌ రైతుబజార్లు

  • ధరల నియంత్రణకు జిల్లా స్థాయి కమిటీలు
  • మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న


విజయవాడ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త గా మరో 131 మొబైల్‌ రైతుబజార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యు మ్న వెల్లడించారు. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి నిత్యం 21వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తున్నాయని, అదే పరిమాణాన్ని కొనసాగించాలని జిల్లా అధికారులకు, మార్కెటింగ్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.  సొం తంగా ట్రాలీ, గూడ్స్‌ వ్యాన్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే, వారికీ మొబైల్‌ రైతుబజార్‌ నిర్వహణకు అనుమతిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న రైతుబజార్లకు 2కిలోమీటర్ల దూరంలో ఈ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బియ్యం, పుప్పులు, కూరగాయలు, పాలు తదితర నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడానికి జిల్లాస్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిత్యావసర సరుకుల సరఫరా, ఇతర సమస్యలను తెలుసుకునేందు కు విజయవాడలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో 24/7 కమాండ్‌ కంట్రోల్‌సెంటర్‌నుఏర్పాటుచేశామని చెప్పారు.

Updated Date - 2020-03-31T09:05:13+05:30 IST