Abn logo
Nov 21 2020 @ 07:59AM

పాక్‌లో 1300 ఏళ్లనాటి హిందూ దేవాలయం

Kaakateeya

పెషావర్‌, నవంబరు 20: పాకిస్థాన్‌లో ఒక అతి పురాతన హిందూ దేవాలయం బయల్పడింది. వాయువ్య పాకిస్థాన్‌లోని స్వాత్‌ జిల్లాలోని బారీకోట్‌ ఘుండాయ్‌ ప్రాంతంలో ఒక పర్వతం వద్ద పాక్‌, ఇటాలియన్‌ పురావస్తు నిపుణులు జరుపుతున్న తవ్వకాల్లో దీనిని కనుగొన్నారు. ఇది దాదాపు 1300 ఏళ్ల క్రితం హిందూ షాహీలు నిర్మించిన విష్ణు దేవాలయమని ఖైబర్‌ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖకు చెందిన ఫజల్‌ ఖలీక్‌ చెప్పారు. ఆలయ సమీపంలో కొలను, వాచ్‌టవర్‌, కంటోన్మెంట్‌ ఆనవాళ్లను కూడా కనుగొన్నామన్నారు. హిందూ షాహీలు లేదా కాబుల్‌ షాహీలు క్రీ.శ.850-1026 ప్రాంతంలో కాబుల్‌ లోయను పాలించిన హిందూ రాజ వంశం. తూర్పు అఫ్ఘనిస్థాన్‌, గాంధార(ఆధునిక పాకిస్థాన్‌), వాయువ్య భారతదేశాన్ని కాబుల్‌ లోయగా వారి పాలనా కాలంలో పిలిచేవారు.

Advertisement
Advertisement