Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్లేడ్‌, చాకుతో పీక కోసుకుంటే చనిపోతారా.. అని తల్లిని అడిగిందా 13 ఏళ్ల బాలిక.. చివరకు..

యూట్యూబ్‌లో చూసి..  పీక కోసుకున్న బాలిక!


చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి 


అంబాజీపేట, సెప్టెంబరు 28: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు. తూర్పుగోౄదావరి జిల్లా అంబాజీపేటలో సోమవారం రాత్రి ఓ బాలిక(13), యూట్యూబ్‌లో ఓ వీడియో చూసి.. తానూ అలాగే బ్లేడుతో పీక కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంబాజీపేటకు చెందిన ఓ మహిళ విజయవాడలో భర్తతో కలిసి ఉండేది. ఏడాది క్రితం భర్త కొవిడ్‌తో మృతిచెందగా, అబ్బాయి, అమ్మాయితో కలిసి అంబాజీపేట వచ్చి పుట్టింట్లో ఉంటోంది. అయితే ఆమె తమ్ముళ్లు, భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు వీరి పోషణ విషయంలో కాదు. కానీ.. ఈ గొడవలతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది.


యూట్యూబ్‌లో బ్లేడుతో పీక కోసుకుని చనిపోవడం ఎలా.. అనే వీడియో చూసింది. బ్లేడ్‌, చాకుతో పీక కోసుకుంటే చనిపోతారా అని తల్లిని అడగడంతో ఆమె మందలించింది. ఈ క్రమంలో.. సోమవారం రాత్రి భోజనం అనంతరం బాలిక బాత్‌రూమ్‌కు వెళ్లి బ్లేడ్‌తో పీక కోసుకుని గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే చూసి అమలాపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక సోమవారం రాత్రి 11 గంటలకు మృతిచెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.  

Advertisement
Advertisement