Texas: 8 మందిని బలి తీసుకున్న 13 ఏళ్ల బాలుడు.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2022-03-20T17:43:57+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Texas: 8 మందిని బలి తీసుకున్న 13 ఏళ్ల బాలుడు.. అసలేం జరిగిందంటే..!
ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు గోల్ఫ్ ప్లేయర్స్

టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు ట్రక్‌ను డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగి 9 మంది మృతికి కారణమైంది. చనిపోయిన వారిలో ఆరుగురు గోల్ఫ్ ఆటగాళ్లు, వారి కోచ్‌తో పాటు ట్రక్ నడిపించిన బాలుడు, అతడి తండ్రి కూడా ఉన్నారు. టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సెఫ్టీ అధికారి స్టీవెన్ బ్లాంకో తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని మిడ్లాండ్‌లో గోల్ఫ్ టోర్నమెంట్‌లో పాల్గొని ఆరుగురు ప్లేయర్లు, వారి కోచ్ ఓ వ్యాన్‌లో తిరిగి ఇంటికి వస్తున్నారు. అదే దారిలో 13ఏళ్ల బాలుడు తన తండ్రితో కలిసి ఓ ట్రక్‌లో వెళ్తున్నాడు. ఆ సమయంలో తండ్రి పక్కన ఉండగా బాలుడు ట్రక్‌ను డ్రైవ్ చేశాడు. 


ఈ క్రమంలో బాలుడు ముందు వెళ్తున్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టాడు. దాంతో వ్యాన్ పల్టీలు కొట్టింది. అనంతరం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపటికే కాలి బూడిదైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సజీవదహనం అయ్యారు. ఇక బాలుడు నడిపిన ట్రక్ కూడా వ్యాన్‌ను ఢీకొట్టిన తర్వాత బోల్తా పడడంతో తండ్రికొడుకు అక్కడికక్కడే చనిపోయారు. అయితే, మొదట ట్రక్ నడిపింది బాలుడి తండ్రి అయి ఉంటాడని పోలీసులు భావించారు. కానీ, అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రమాద సమయంలో ట్రక్‌ను డ్రైవ్ చేసింది బాలుడని తెలిసింది. శుక్రవారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టీవెన్ బ్లాంకో తెలిపారు.  

Updated Date - 2022-03-20T17:43:57+05:30 IST