13 ప్రత్యేక రైళ్ల వేళల్లో మార్పులు

ABN , First Publish Date - 2021-06-18T14:26:56+05:30 IST

తూత్తుకుడి, సెంగోట్టై సహా 13 ప్రత్యేక రైళ్ల టేంటేబుల్‌లో స్వల్పంగా మార్పు చేసినట్టు దక్షిణ రైల్వే శాఖ తెలిపింది. దీనిపై గురువారం ఆ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్ల

13 ప్రత్యేక రైళ్ల వేళల్లో మార్పులు


ప్యారీస్‌(చెన్నై): తూత్తుకుడి, సెంగోట్టై సహా 13 ప్రత్యేక రైళ్ల టేంటేబుల్‌లో స్వల్పంగా మార్పు చేసినట్టు దక్షిణ రైల్వే శాఖ తెలిపింది. దీనిపై గురువారం ఆ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్ల రాకపోకల్లో మార్పులు చేపట్టినట్టు తెలిపింది. తూత్తుకుడి-మైసూర్‌ మధ్య ప్రతిరోజూ నడుపుతున్న ప్రత్యేక రైలు (నెం.06235) సాయంత్రం 4.40 గంటలకు తూత్తుకుడిలో బయల్దేరి 6.03 గంటలకు సాత్తూర్‌ చేరుకుంటుంది. ఈనెల 18వ తేదీ నుంచి ఓకా- తూత్తుకుడి వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు (నెం.09568) తూత్తుకుడి నుంచి తెల్లవారుజామున 4.40 గంటలకు బయల్దేరుతుంది. ఎగ్మూర్‌-తూత్తుకుడి ప్రత్యేక రైలు (02693) తూత్తుకుడికి ఉదయం 6.40 గంటలకు, ఎగ్మూర్‌-సెంగోట్టై (02661)  ప్రత్యేక రైలు ఉదయం 6.25 గంటలకు సెంగోట్టై చేరుకుంటాయి. ఎగ్మూర్‌-రామేశ్వరం ప్రత్యేక రైలు (02205) ప్రత్యేక రైలు తెల్లవారుజామున 4.20 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. కొల్లం- ఎగ్మూర్‌ (నెం.06724) ప్రత్యేక రైలు రాత్రి 8.53 గంటలకు కోవిల్‌పట్టి, 9.13 గంటలకు సాత్తూర్‌ చేరుకుంటుంది. తిరునల్వేలి-పాలక్కాడు ప్రత్యేక రైలు (06791), తిరుపతి- రామేశ్వరం (06779) సహా 13 ప్రత్యేక రైళ్ల రాకపోకల్లో స్వల్ప మార్పులు చేసినట్టు దక్షిణ రైల్వే తెలియజేసింది.


Updated Date - 2021-06-18T14:26:56+05:30 IST