‘గాలి’లో దీపాల్లా ప్రాణాలు

ABN , First Publish Date - 2021-05-06T07:47:59+05:30 IST

ఆక్సిజన్‌ కొరతతో దేశంలోని ఆస్పత్రుల్లో కరోనా రోగుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈ తరహా ఉదంతాలు...

‘గాలి’లో దీపాల్లా ప్రాణాలు

  • ఆక్సిజన్‌ కొరతతో తమిళనాడులో 13 మంది మృతి
  • ప్రాణ వాయువు కొరత కారణం కాదన్న కలెక్టర్‌
  • ఉత్తరాఖండ్‌ రూర్కీలో ఐదుగురి కన్నుమూత

చెన్నై/న్యూఢిల్లీ, మే 5(ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్‌ కొరతతో దేశంలోని ఆస్పత్రుల్లో కరోనా రోగుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈ తరహా ఉదంతాలు చోటుచేసుకోగా.. తాజాగా మరో రెండు రాష్ట్రాల్లోనూ సంభవించాయి. ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఇలా 13 మంది మృ13తిచెందారు. అకస్మాత్తుగా పల్స్‌ పడిపోవడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి పలుసార్లు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బుధవారం నిల్వ లు నిండుకోవడంతో వైద్యులు సమీప ఆస్పత్రులతో పాటు అంబులెన్సుల్లో ఉన్న సిలిండర్లను తెప్పించి ప్రాణ వాయువు అందించే ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఆలస్యం కావడంతో కేవలం గంట వ్యవధిలో ఐదుగురు మృతి చెందారు. తర్వాత 8 మంది చనిపోయారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ జాన్‌ లూయిస్‌ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


రోగుల మరణానికి ఆక్సిజన్‌ కొరత కారణం కాదని ప్రకటించారు. అయితే, ఆక్సిజన్‌ లేకుండా బాధితులకు చికిత్స చేసేది ఎలాగంటూ ఆస్పత్రి వైద్యులు మెరుపు ధర్నాకు దిగారు. కాగా, ఉత్తరాఖండ్‌ రూర్కీలోని ప్రైవేటు ఆస్పత్రిలో మహిళ సహా ఐదుగురు కరోనా రోగులు ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ విజృం భిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రాణవాయువు (ఆక్సి జన్‌)కు అత్యంత ఆవశ్యకత ఏర్పడిందని ఆపోలో హాస్పటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతా రెడ్డి అన్నారు. అందువల్ల.. రోగుల ప్రాణాలు కాపాడా లంటే కరోనా చికిత్స చేసే ఆస్పత్రులకు 30 నిమిషా ల్లో ఆక్సిజన్‌ చేరేవేసేలా నిల్వ కేంద్రాలు ఉండాలం టూ ప్రధానికి ట్విటర్‌ ద్వారా సూచించారు. కనీసం 25 భారీ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. వాటి వద్ద ఆరు సరఫరా వాహనాలు నిరంతరం సిద్ధంగా ఉంచాలని సంగీతారెడ్డి అన్నారు.  


Updated Date - 2021-05-06T07:47:59+05:30 IST