జిల్లాలో 13 చెక్‌పోస్టులు

ABN , First Publish Date - 2021-05-14T07:21:20+05:30 IST

లాక్‌డౌన్‌ను జిల్లాలో సక్రమంగా అమలుచేయడానికి జిల్లా 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. తర్క పల్లిలో లాక్‌డౌన్‌ను పరిశీలించి మాట్లాడారు

జిల్లాలో 13 చెక్‌పోస్టులు
తుర్కపల్లిలో చెక్‌ పోస్టును పరిశీలించి మాట్లాడుతున్న డీసీపీ నారాయణరెడ్డి

డీసీపీ నారాయణ రెడ్డి

 లాక్‌డౌన్‌ రెండో రోజు గురువారం జిల్లాలో విజయవంతంగా ముగి సింది. ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉండడంతో నిత్యావసర సరుకులు, కూరగా యలు, మందు లు కొనుగోలు చేయడానికి ప్రజలు బయటికి రావ డంతో అంతా రద్దీ నెలకొంది. ఆ తర్వాత దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేయడంతో నిర్మానుష్యంగా మారింది.  ఉదయం 10 గంటల లోపు ప్రయాణాలకు సడలింపు ఉండటంతో హైదరాబాద్‌ -చౌటుప్పల్‌, హైదరాబాద్‌-వరంగల్‌ రహదారులపై వాహనాల రద్దీ కనిపించింది. గురువారం నుంచి పెళ్ళి ముహూర్తాల ఉండడంతో చీరలు, బంగారం, కిరాణం దుకాణాల్లో రద్దీ కనిపించింది. 

- ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌

లాక్‌డౌన్‌ను జిల్లాలో సక్రమంగా అమలుచేయడానికి జిల్లా 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.  తర్క పల్లిలో లాక్‌డౌన్‌ను, భవనగిరిలోని రాయిగిరి చెక్‌పోస్టును ఆలేరులోని ప్రకాశ్‌గార్డెన్‌ సమీపంలోని 163వ జాతీయ రహదారిపై  ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు, రాజాపేట మండలం పొట్టిమర్రి చెక్కు పోస్టును ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌, కొవిడ్‌ నిబంధనలు పాటించి కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని కోరారు. డీసీపీ వెంట యాదాద్రి ఏసీపీ కె. నర్సింహరెడ్డి, ఎస్‌ఐ మధుబాబు ఉన్నారు. భూదాన్‌పోచంపల్లిలో లాక్‌డౌన్‌ను  ఏసీపీ సత్తయ్య, పరిశీలించారు. రెండు దుకాణాలు తెరిచి ఉండడంతో బంద్‌ చేయించారు. ఏసీపీ వెంటఎస్‌ఐ సైదిరెడ్డి, ఎఎస్‌ఐలు ఇద్దయ్య, శ్రీనివాస్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. 

ఫంక్షన్‌హాల్‌ నిర్వాహకుడిపై కేసు 

భువనగిరి మండలం హన్మాపురం గ్రామ శివారులోని సాయిపుష్పా ఫంక్షన్‌హాల్‌లో జరి గిన వివాహానికి  40 మంది కంటే ఎక్కువ మందిని అనుమతిం చడంతో నిర్వాహకుడు రంగ మల్లేష్‌పై భవనగిరి రూరల్‌ ఎస్‌ఐ కె.సైదు లు కేసు నమోదు చేశారు. మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న అదే గ్రామానికి చెందిన  దాబా హోటల్‌ యజమాని సూదగాని సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

జరిమానాలు

చౌటుప్పల్‌లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన 66మంది వాహనదారులపై కేసు నమోదు చేసి రూ.33,400లు జరిమానా విధిం చినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.  అదేవిధంగా మాస్కులు ధరించని 20మందిపై కేసులు చేసి రూ.1000 వంతున జరిమానా, లాక్‌డౌన్‌  నిబం ధనలు ఉల్లంఘించి రాకపోకలు సాగిస్తున్న 12మంది వాహనదారులపై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ సీఐ తెలిపారు.





Updated Date - 2021-05-14T07:21:20+05:30 IST