సినీతారలంటే ప్రజల్లో మాటల్లో చెప్పలేనంత క్రేజ్. సెలబ్రిటీలు చేసే పర్యటనలు, వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాలు ఇతర విషయాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అభిమానుల అభిలాషకు తగ్గట్టే సినీతారలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారు. తమ జీవితాల్లో జరిగినే ముఖ్యమైన ఘటనల గురించి షేర్ చేస్తుంటారు. ఈ ఏడాది హాలీవుడ్ మహిళా స్టార్లు అనేక మంది తాము ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. వీరందరూ 2022లో తమ జీవితాల్లోకి ఓ చిట్టిపాపాయిని ఆహ్వానించబోతున్నారు. మరి అభిమానులకు వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెప్పబోయే సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం పదండి..
వోగ్ విలియమ్స్..
వోగ్ విలియమ్స్ ప్రస్తుతం మూడోసారి గర్భం దాల్చింది. ఆమె భర్త పేరు స్పెన్సర్ మ్యాథ్యూస్. ‘‘కొన్నేళ్ల క్రితం ఎవరైనా నాతో.. నీకు 33 ఏళ్లు వచ్చేసరికి ముద్దొచ్చే ముగ్గురు చిన్నారులకు తల్లివవుతావు అని అంటే నేను కచ్చితంగా ఒప్పుకునేదాన్ని..ఎందుకంటే మొదటి నుంచి నా ప్లాన్ అదే’’.. అంటూ సంబరపడిపోతూ చెప్పింది విలియమ్స్.
లూసీ మెక్లెన్ల్బ్ర
తాను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాయని లూసీ ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం ఆమె రయాన్ థామస్‌తో రిలేషన్షిప్లో ఉంది. ‘‘ఇది మళ్లీ మొదలైంది’’.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టిన ఆమె తన ఫొటోను కూడా షేర్ చేసింది. ఆ చిత్రంలో లూసీతో పాటూ ఆమె తొలి సంతానం(1) కూడా ఉన్నాడు.
సామ్ ఫేయర్స్..
సామ్ ఫేయర్స్ కూడా ఇటీవల తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపెట్టింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు పాల్ నైట్లీ.
ఆష్లే గ్రాహమ్..
తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించిన ఆష్లే.. తనకు కవలలు పుట్టబోతున్నారంటూ అభిమానులకు ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది.
జెస్సీ కేవ్..
పాపులర్ మూవీ సిరీస్ హారీ పాటర్లో లావెండర్ బ్రౌన్ పాత్ర పోషించిన జెస్సీ కేవ్ కూడా ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఇది తనకు నాలుగో గర్భం అంటూ జెస్సీ ఇన్‌స్టాలో వెల్లడించింది. ఈ విషయాన్ని ఇక ఎంతో కాలం దాచలేను అంటూ ఓ సరదా కామెంట్ కూడా పెట్టింది.
జూలియా స్టైల్స్..
90వ దశకంలో హాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన నటి జూలియా స్టైల్స్. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. తాజాగా మరోసారి ఆమె ప్రెగ్నెంట్ అయింది. ది హ్యూమన్స్ సినిమా విడుదల సందర్భంగా తన బేబీ బంప్(గర్భం)తో ఫొటోలకు ఫోజులిస్తూ తెగ హల్చల్ చేసింది జూలియా స్టైల్స్.
మార్గన్ స్టీవర్ట్..
E! News! వ్యాఖ్యాత మార్గన్ స్టీవర్ట్ కూడా ఇటీవలే తన ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో ప్రకటించింది. ఏడాది మొదట్లోనే ఆమె తన తొలి సంతానం రో రెనగ్లీకి జన్మనిచ్చింది. ఆ తరువాత కొన్ని నెలలకే ఆమె.. తను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.
కైలీ జెన్నర్..
తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కైలీ జెన్నర్ కూడా కొన్ని నెలల క్రితమే అభిమానులతో పంచుకుంది. అయితే.. వైద్యులు డెలివరీ డేట్ ఎప్పుడిచ్చారన్న విషయాన్ని మాత్రం ఆమె బహిరంగంగా వెల్లడించలేదు. కైలీ భర్త పేరు ట్రావిస్ స్కాట్. ఆ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు.
ఒలీవియా మన్..
ఒలివీయా మన్ తొలిసారిగా ప్రెగ్నెంట్ అయింది. ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు జాన్ ములానే. అయితే.. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆమె చెప్పకముందే మీడియాలో వార్త రావడంతో కొంత ఒత్తిడికి లోనైన విషయాన్ని కూడా ఆమె పేర్కొంది. ఇప్పటికే తన వయసు 41 అవడంతో పాటూ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ (రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన సమస్య) కూడా ఉండటంతో తాను కొంత ఒత్తిడిలో ఉన్నట్టు పేర్కొంది.
జెన్నిఫర్ లారెన్స్...
జెన్నిఫర్ లారెన్స్.. హాలీవుడ్ టాప్ నటుల్లో ఒకరు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో ఆమె అభిమానులు మురిసిపోయారు. అంతేకాదు.. ఆమె ఫొటోలు కూడా ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యాయి. ప్రెగ్నెన్సీలోనూ కొత్త అందంతో లారెన్స్ మెరిసిపోతోందంటూ మన బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆమెపై ఇటీవల ప్రసంశల వర్షం కురిపించారు. జెన్నిఫర్ భర్త పేరు కూక్ మరూనీ.
రోజీ హంటింగ్టన్ వైట్లీ..
రోసీ హంటింగ్టన్ వైట్లీ కొన్ని నెలల క్రితమే తాను గర్భంతో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ జే సన్ స్టేటమ్ ఆమె భర్త. రోజీ రెండో మారు గర్భం దాల్చింది. ఇది రెండో రౌండ్ అంటూ ఆమె సోషల్ మీడియాలో సరదాగా వ్యాఖ్యానించింది.
కెమిల్లా థర్లో..
తాను రెండోసారి గర్భం దాల్చానంటూ కెమిల్లా థర్లో తాజాగా ప్రకటించింది. కెమిల్లా భర్త పేరు జేమీ జెవిట్. మాకు ఈ ఏడు తొలినాళ్లలోనే ఓ బహుమతి వచ్చింది అంటూ ఆ దంపతులు ఇన్‌స్టాలో వ్యాఖ్యానించారు.
జెస్ రైట్..
రియాలిటీ షోలతో పాపులారిటీ సాధించిన జెస్ రైట్ తాను ప్రెగ్నెంట్ అయినట్టు సోషల్ మీడియాలో పేర్కొంది. ఆమె భర్త పేరు విలియం లీ కెంప్. ఇది మాకో దీవెన.. మేము ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేము అంటూ వారు వ్యాఖ్యానించారు.