Amit sha పర్యటనకు ముందే లొంగిపోయిన 13 మంది Adivasi militants

ABN , First Publish Date - 2022-05-09T00:06:28+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటనకు ముందే ఆసోంలోని తీవ్రవాద సంస్థ ఆల్ ఇండియా నేషనల్ ఆర్మీకి చెందిన..

Amit sha పర్యటనకు ముందే లొంగిపోయిన 13 మంది Adivasi militants

గౌహతి: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit sha) పర్యటనకు ముందే ఆసోంలోని తీవ్రవాద సంస్థ All Adivasi National Army (AANLA)కి చెందిన సుమారు 13 మంది క్యాడర్ లొంగిపోయారు. కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలోని భద్రతా బలగాల సమక్షంలో వీరు సరెండర్ అయ్యారు. అమిత్‌షా ఆదివారం సాయంత్రం నుంచి అసోంలో మూడు రోజుల పర్యటించనున్నారు. ఆదివాసీ మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆయుధాలు విడిచిపెట్టి అసోం పోలీసుల ముందు లొంగిపోయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. శర్మ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంగళవారంనాడు గౌహతిలో జరిగే ర్యాలీలో అమిత్‌షా పాల్గొంటారు.


అసోంలోని టీ తోట కూలీలతో సహా అదివాసీ కమ్యూనిటీకి చెందిన వారికి ఎస్‌టీ హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై 2006లో ఏఎఎన్ఎల్ఏ ఏర్పాటయింది. ప్రధానంగా కర్బి ఆంగ్లాంగ్, గోలాఘాట్ జిల్లాల్లో ఈ సంస్థ ఉనికి ఉంది. గతంలో పలు విచ్ఛిన్నకర కార్యకలాపాల్లో ఈ మిలిటెంట్ సంస్థ ప్రమేయం ఉంది. ఇప్పటికీ సంస్థలో 100 మంది క్యాడెర్ ఉన్నారని, 2020 నుంచి పలు మిలిటెంట్ గ్రూపుల విషయంలో అనుసరిస్తున్న అగ్రిమెంట్‌ తరహాలోనే తాజాగా పలువురు మిలిటెంట్లు ఆయుధాలు విడిచిపెట్టి  లొంగిపోవడం మంచి పరిణామమని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే లొంగిపోయిన పలు మిలిటెంట్ సంస్థల సభ్యులకు పునరవాసం కల్పించామని, మరికొన్ని సంస్థల సభ్యులు కూడా ఇదే బాటలో లొంగిపోయి, కాల్పుల విరమణ పాటిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Read more